Ministerial hour burned on the authorities

అధికారులపై మండపడ్డ మంత్రి గంటా

Date:15/02/2018
 అమరావతి ముచ్చట్లు:
రాష్ట్రంలో టెట్ నిర్వహణ లోపాలపై గురువారం నాడు మంత్రి గంటా శ్రీనివాస్రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారుల తీరును మంత్రి తప్పుపట్టారు. పరీక్షా కేంద్రాలను ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో కేటాయించడంపై మండిపడ్డారు. టెట్ నిర్వహణలో మొదటి నుంచీ అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. తొలిసారి ఆన్లైన్లో టెట్ నిర్వహిస్తున్నందుకు లోపాలు తలెత్తకుండా చూడమంటే అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేయడమేంటని మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. గందరగోళం నేపథ్యంలో అభ్యర్ధుల అప్షన్కు సాయంత్రం వరకు గడువు విధించారు. 16 వేల మందికి గాను గురువారం మధ్యాహ్నం వరకు వరకు పదివేలమంది మాత్రమే అప్షన్లు ఇచ్చారు. టెట్ పరీక్షమాత్రం యథావిధిగా ఈ ఈ నెల 21 నుంచి  జరగనుంది.
Tags: Ministerial hour burned on the authorities

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *