బాసరలో శివాజీ విగ్రహాన్నీ ఆవిష్కరించిన మంత్రులు హరీష్, ఇంద్రకరణ్.

నిర్మల్  ముచ్చట్లు:
నిర్మల్ జిల్లా బాసరలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని  మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, వేణుగోపాలచారి, ఇతర ప్రజా ప్రతినిదులు పాల్గోన్నారు.
ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ అడవుల పునరుద్ధరణ కార్యక్రమమం జరగడంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎంతో కృషి చేశారు. 7.7 శాతం అడవుల పునరుద్ధరణ జరిగింది అంటే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఐకే రెడ్డి కి ఆ ఘనత దక్కుతుందని అన్నారు. బాసర జంక్షన్ లో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషకరం. పరిపాలన, యుద్ద నైపుణ్యంలో అన్నింటా శివాజీ ఆదర్శం. మత సామరస్యాన్ని చాటారు. ప్రజలే ప్రభువులుగా పాలించారు.  శివాజీ ఎన్నో యుద్దాలు చేసినా హింసను ప్రోత్సహించలేదు.. పవిత్ర స్థలాలు ధ్వంసం చేయలేదు.  ముఖ్యమంత్రి కేసీఆర్  రాష్ట్రాన్ని సాధించడంలో శివాజీ  స్ఫూర్తి అని అన్నారు.
అహింసా మార్గంలో 14 ఏళ్లు పోరాటం చేసి.. తెలంగాణ సాధించి.. అద్భుత పాలన అందిస్తున్నారు. అభివృద్ధిలో తెలంగాణ దేశానికి మోడల్ దేశానికి అయ్యింది. పక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రజలు ఇక్కడి పథకాలు అమలు చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని అడుగుతున్నారని అన్నారు. స్థానిక ప్రతినిధుల కోరిక మేరకు బాసర పి హెచ్ సి కి అంబులెన్స్ మంజూరు చేస్తున్నమని అన్నారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ బాసర అమ్మవారిని మంత్రి హరీశ్ రావు దర్శనం చేసుకొని,  శివాజీ విగ్రహాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది. బాసర దేవాలయాన్ని ప్రభుత్వం వంద కోట్లతో అభివృద్ధి చేయనున్నది. రాబోయే రోజుల్లో బాసర పెద్ద పుణ్యక్షేత్రం అవుతుందని అన్నారు.
 
Tags:Ministers Harish and Indrakaran unveil Shivaji statue in Basra

Natyam ad