Ministers participated in the meeting of the Tadeppa district level coordination committee

తెదేపా జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రులు

Date:25/01/2018

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతిలోని వైస్రాయి హోటల్లో తెదేపా జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు అమరనాథ్ రెడ్డి, అచ్చెన్నాయుడు మాట్లాడుతూ నవ్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రస్తుతం తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు లబ్ది చేకూర్చే భాద్యత ప్రతి నాయకుడు, కార్యలర్త పైన ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షతతో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తోందన్నారు. రాబోయే 2019 అసెంబ్లీ ఎన్నికలలో తెదేపా ను గెలిపించి చంద్రబాబు నాయుడుని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలన్నారు. పార్టీ ని పటిష్ఠ పరచడానికి నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలవద్దకు వెళ్ళి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి ,చిత్తూరు జిల్లా ఎంపీ ఎన్. శివప్రసాద్, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, పుంగనూరు దేశం నేత వెంకట్రమణ రాజు తదితర నాయకులు పాల్గొన్నారు.

Tags : Ministers participated in the meeting of the Tadeppa district level coordination committee

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *