మైనర్ బాలిక అత్యాచారం కేసు,నిందితుడు అరెస్టు.

నిర్మల్  ముచ్చట్లు:
 
నిర్మల్ పట్టణం వైయస్సార్ కాలనీకి చెందిన మైనర్  బాలికపై అత్యాచారానికి పాల్పడిన మునిసిపల్  వైస్ చైర్మన్ సాజిద్ ఖాన్ అరెస్టు అయ్యాడు. నిందితుడిని నిర్మల్ రూరల్ మండలం అనంతపేట్
శివారులో పోలీసులు పట్టుకున్నారు. సాజిద్ ఖాన్ తో పాటు సహకరించిన డ్రైవర్ జాఫర్ , అన్నపూర్ణ  అరెస్ట్ చేసారు. సహకరించినందుకు మహిళకు డబుల్ బెడ్ రూమ్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.
ఫంక్షన్ పేరిట మైనర్ బాలికను వెంట అన్నపూర్ణ తీసుకెళ్లింది. హైదరాబాద్  లాడ్జ్ లో అత్యాచారం జరిగినట్లు పోలీసులు నిర్దారించారు.  నిందితులపై పొక్సో చట్టం 363, 376 ఐపిసి సెక్షన్ల కింద కేసు
నమోదు అయింది. వారినుంచి కారు, మూడు సెల్ ఫోన్లు  స్వాధీనం చేసుకున్నారు. కేసు, ఆరెస్టు వివరాలు  నిర్మల్  డిఎస్పి ఉపేందర్ రెడ్డి వెల్లడించారు.
 
Tags:Minor girl rape case, accused arrested

Natyam ad