నంద్యాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులుగా మైనార్టీ నాయకులకు అవకాశం ఇవ్వాలి

– రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి షేక్ మస్తాన్ ఖాన్
నంద్యాల ముచ్చట్లు:
 
నంద్యాల పట్టణంలో సోమవారం నాడు ఓ ప్రకటనలో రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి షేక్ మస్తాన్ ఖాన్ మాట్లాడుతూ నంద్యాల యందు కొన్ని సంవత్సరాలుగా అన్ని కులాల వారికి నంద్యాల కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇచ్చారని కాని మైనార్టీ వారికి ఇవ్వ డం లేదని ఆయన అన్నారు. నంద్యాల యందు అధిక జనాభా కలిగిన ముస్లిం సోదరులు ఉన్నారని ఆయన అన్నారు. కావున స్టేట్ కాంగ్రెస్ కమిటీ నాయకులు ఆలోచించి నంద్యాల యందు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా  ముస్లిం సోదరులకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. అధికార ప్రతి పక్ష పార్టీలు కూడా నంద్యాల యందు పెద్ద పీట వేశారు అని ఆయన గుర్తుచేశారు.
గుండెపోటుతో నిరుద్యోగి మృతి
Tags: Minority leaders should be given a chance as Nandyal town Congress president

Natyam ad