కోహ్లీ సేనకు కోచ్‌గా మిథాలీ రాజ్‌!

ఈనాడు.

Date :02/01/2018

ముంబయి: అదేంటీ మిథాలీ రాజ్‌ భారత మహిళల క్రికెట్‌ జట్టు సారథి కదా. ఇప్పుడు కోహ్లీ సేనకు కోచ్‌ ఏంటి అని అనుకుంటున్నారా! ఏమీ లేదండీ బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుక్‌ ఖాన్‌ తాజాగా మిథాలీ రాజ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ నేపథ్యంలో మిథాలీని భారత పురుషుల జట్టు ప్రధాన కోచ్‌గా చూడాలనుకుంటున్నాం అని అన్నాడు. ఇంతకీ ఈ ప్రశ్నకు మిథాలీ ఏమని సమాధానం ఇచ్చి ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం చదివేయండి.తాజాగా షారుక్‌ ఖాన్‌-మిథాలీ రాజ్‌ స్టార్‌ ప్లస్‌లో ఓ కార్యక్రమం కోసం బుల్లితెరను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో షారుక్‌ అడిగిన కొన్ని ప్రశ్నలకు మిథాలీ బదులిచ్చారు. ‘మైదానంలో తాము ఆడున్నంతసేపు.. మన జట్టు ట్రోఫీతో తిరిగి వస్తుందని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. అందుకే క్రీజులో ఉన్నంతసేపు ఆటపైనే దృష్టి అంతా. మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికే చూస్తాం’ అని మిథాలీ ఓ ప్రశ్నకు బదులు ఇచ్చింది. అనంతరం షారుక్‌.. మిథాలీని టీమిండియా పురుషుల జట్టు ప్రధాన కోచ్‌గా చూడాలనుకుంటున్నాం అని అనగా.. ‘నేను ఎప్పుడూ నా బెస్ట్‌ ఇవ్వాలనే కోరుకుంటాను’ అనిబదులిచ్చింది.

గత ఏడాది ప్రపంచకప్‌లో మ్యాచులు జరుగుతున్న సమయంలో మిథాలీ ఏదో ఒక పుస్తకం చదువుతూ మనకు ఎన్నోసార్లు కనిపించింది. దీని గురించి అడగ్గా.. ‘ఒత్తిడిని అధిగమించడానికే పుస్తకాలు చదువుతా. పుస్తకాలు మనల్ని ప్రోత్సహించడంలోనూ ఎంతో సాయం చేస్తాయి’ అని బదులిచ్చింది.‘టెడ్‌ టాక్స్‌ ఇండియా నయీ సోచి’ కార్యక్రమానికి షారుక్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్నారు. మిథాలీరాజ్‌ను ఇంటర్వ్యూ చేసిన ఈ ఎపిసోడ్‌ ఈ నెల 7న ప్రసారం కానుంది.

Tags : Mithali Raj as coach for Kohli

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *