ప్రభుత్వ పాఠశాల అభివృద్దికి ఎమ్మెల్యే శంకుష్థాపన

అవనిగడ్డ ముచ్చట్లు:


కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండలంలో నాడు – నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులు కూడా ఇంగ్లీష్ మీడియంలో అత్యున్నత ప్రమాణాలతో, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన తరగతి గదుల్లో విద్యాభ్యాసం చేయాలనే సమున్నత ఆశయంతో నాడు – నేడు కార్యక్రమం చేపట్టి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేస్తోందన్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేద కుటుంబాల్లో విద్యా వెలుగులు ప్రసరింపచేసేందుకు కృతనిశ్చయంతో నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. రూ.51లక్షలతో పురిటిగడ్డ జడ్పీ హైస్కూల్, రూ.42 లక్షలతో వక్కలగడ్డ జడ్పీ హైస్కూల్, రూ.16 లక్షలతో పాగోలు శ్రీనగర్ ఎంపీపీ స్కూల్, రూ.14 లక్షలతో చల్లపల్లి ఎంపీపీ జేబీ స్కూల్ అభివృద్ధికి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు శంకుస్థాపన చేశారు.

 

Tags: MLA Concreting for Public School Development

Post Midle
Post Midle
Natyam ad