Natyam ad

బెంగాల్ అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు..?

కోల్కత: పశ్చిమ బెంగాల్ శాసనసభలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న బీరూం సజీవదహనాల ఘటనపై అధికార తృణమూల్ కాంగ్రెస్, భాజపా ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇది కాస్తా తీవ్ర రూపం దాల్చి ఎమ్మెల్యేలు పరస్పరం దాడులకు దిగారు. ఇరు పక్షాల ఎమ్మెల్యేలు ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకున్నారు. ఇటీవల బీర్భూం జిల్లాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో 8 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టిన భాజపా.. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై సీఎం మమతా బెనర్జీ సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేసింది. అయితే భాజపా నేతల వ్యాఖ్యలను తృణమూల్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది