Natyam ad

గూడూరు రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే

గూడూరు ముచ్చట్లు:
 
గూడూరు  పట్టణ పరిధిలో ఖాళీ స్థలాలు కలిగిన యజమానులు వాటిని పరిశుభ్రంగా ఉంచాలని లేనిపక్షంలో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు పేర్కొన్నారు .  గూడూరు పట్టణ పరిధిలోని బజార్ వీధి ,  బనిగి  సాహెబ్ పేట , అశోక్ నగర్ ప్రాంతాల్లోని రోడ్లను ఎమ్మెల్యే వరప్రసాదరావు పరిశీలించారు . ఆయన వెంట గూడూరు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ ,  వైసిపి నాయకులు ,  స్థానిక  వార్డు సచివాలయం  సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు .గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ నుండి బజారు వీధి మీదుగా అశోక్ నగర్ వరకు  ఉన్న రోడ్లను ఆయన పరిశీలించారు .  ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు .  ఎమ్మెల్యే వరప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ పట్టణ పరిధిలో పారిశుధ్యం పై  ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చర్యలు చేపడుతున్నామని తెలిపారు . కావున పట్టణ ప్రజలు మున్సిపల్ శాఖ సిబ్బందికి సహకరించి గూడూరు పరిశుభ్రంగా ఉండేలా సహకారం అందించాలని కోరారు .  ప్రజలకు అసౌకర్యంగా ఉండకుండా  మున్సిపల్ శాఖ అధికారులు చర్యలు చేపడతారు అని తెలిపారు .
 
Tags: MLA inspecting Gudur roads