వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే కాకాని

ముత్తుకూరు ముచ్చట్లు:
ముత్తుకూరు మండల కేంద్రంలోని ముత్తుకూరు సచివాలయంలో నూతనంగా నియామకమైన వాలంటీర్లకు నియామక పత్రాలు ఎమ్మెల్యే కాకాని అందజేశారు. నెల్లూరు జిల్లా ,సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం కేంద్రంలోని ముత్తుకూరు సచివాలయం-1 నందు ప్రజల సమస్యలపై అర్జీలను అధికారులతో కలిసి  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాఅధ్యక్షులు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి శుక్రవారం స్వీకరించారు. అనంతరం నూతన వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయాల లో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా వారి పాలన సాగించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా అర్జీదారులతో మాట్లాడారు. నూతనంగా నియమితులైన వాలంటీర్లు నియమ నిబంధనలతో విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, నూతన వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
 
Tags:MLA Kakani handing over the appointment papers to the volunteers

Natyam ad