తిరుపతి గరుడవారధి ప్రారంభోత్సవ పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి, మేయర్‌ శిరీషా

తిరుపతి ముచ్చట్లు:
 
తిరుపతిలో కొనసాగుతున్న శ్రీనివాస సేతు వారధి నిర్మాణ పనులను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పరిశీలించారు. నగర మేయర్ డాక్టర్ శిరీషతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో భూమన మాట్లాడారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి కామెంట్స్.స్వామివారి సన్నిధి తిరుమలకు వెళ్లే భక్తుల కోసమే చేయతలపెట్టి, నిర్మిస్తున్న శ్రీనివాస సేతు వారధిని అత్యంత తొందర్లోనే పూర్తిచేయాలన్న సంకల్పం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది.తిరుమలకు రోజు వారీ వచ్చే వేలాది మంది భక్తులకు తిరుపతి లో ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేయడం జరుగుతోంది.ఒక వైపున తిరుచానూరు మార్గం నుంచి భక్తులకు, మరొకవైపున విజయవాడ నుంచి భక్తులకు కోసం… అలాగే తిరుపతి బస్టాండ్, శ్రీనివాసం సముదాయాల వద్ద బస్సు దిగిన తర్వాత నేరుగా తిరుమల కు వెళ్ళటానికి ఇంతకు పూర్వం దాదాపు ట్రాఫిక్ సమస్యల కారణంగా 30 , 40 నిమిషాలు సమయం పట్టేది. కానీ ఇప్పుడు కేవలం రెండు నిమిషాల్లో వెళ్లేలా ఈ ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది.దీనికి సంబంధించి మొదట ఆర్టీసీ బస్టాండ్ వద్ద శ్రీనివాస సముదాయం నుంచి దారి నిర్మాణం పూర్తయింది.
 
తొందరలో దాన్ని గౌరవనీయ ప్రియతమ ముఖ్యమంత్రి  ప్రారంభోత్సవం చేస్తారు.ఈ ప్రాజెక్టు దాదాపు 600 కోట్ల రూపాయల అంచనాలతో చేపట్టడం జరిగింది.ఇందులో 67% తిరుమల తిరుపతి దేవస్థానం వారికి తిరుపతి స్మార్ట్ సిటీ సహకరిస్తోంది.పూర్తిగా తిరుమలకు వెళ్లే టువంటి భక్తులకు మాత్రమే నూటికి నూరు శాతం ఉపయోగపడాలన్న ఆలోచనతో చేపట్టిన నిర్మాణం సాధ్యమైనంత తొందరలో పూర్తి చేయడం జరుగుతుంది. ఇప్పటికే 225 రూపాయలు దీని మీద వ్యయం చేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం 67 శాతం నిధులు ఇవ్వనుండగా, ఇప్పటికే 75 కోట్ల రూపాయలు నిధులు అందించడం జరిగింది. దాదాపు 250 కోట్ల రూపాయలు నిధులు అతి తొందర్లోనే ఇవ్వాలని సంకల్పించడం జరిగింది. అత్యంత తొందర్లోనే శ్రీనివాస సేతు ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరుగుతుంది.

Tags:MLA Karunakarreddy inspects Tirupati Garudavaradhi inauguration works, Mayor Sirisha

Natyam ad