7 కిలోమీటర్ల తారు రోడ్డు ఆధునీకరణకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీకారం.

నెల్లూరు ముచ్చట్లు:
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం  పరిధిలోని ఇరగాలమ్మ దేవస్థానం నుండి 7 కిలోమీటర్ల తారు రోడ్డు ఆధునీకరణకు పొట్టేపాలెం వరకు 6 కోట్ల రూపాయలతో ఆధునీకరణ పనులకు 41వ డివిజన్, ఇరగాలమ్మ సెంటర్ వద్ద  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగర మేయర్ పొట్లూరి స్రవంతి మరియు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ నెలాఖరు లోపు గ్రామీణ నియోజకవర్గం పరిధిలోని దెబతిన్న రహదారులన్నిటిని ఆధునీకరించి, ప్రజలకు ప్రయాణ కష్టాలు తీరుస్తామని, ఇప్పటికే నెల్లూరు రూరల్ పరిధిలోని పలు రోడ్లు పనులు మొదలయ్యాయని తెలిపారు . శంకుస్థాపన చేసిన పనులన్నీ జూన్ నెలాఖరులోపు పూర్తిచేసి, ప్రజలకు నాణ్యమైన రోడ్లను అందుబాటులోకి తీసుకు వస్తాం అని భరోసా ఇచ్చారు.  రహదారులు పూర్తిగా దెబ్బతిని ప్రజల ప్రయాణ కష్టాలు ఎదురుకోవడాన్ని తాను స్వయంగా చూసి ఆవేదనకు గురయ్యానన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చొరవతో రోడ్లు మరియు భవనాలశాఖ ద్వారా నిధులు సమీకరించుకొని ,నెల్లూరు గ్రామీణ ప్రాంతాలలో  దెబతిన్న రహాదారులన్నిటిని ఆధునీకరిస్తున్నాం అని తెలియజేశారు. పొట్టెపాలెం వరకు రోడ్డు పూర్తైన తరువాత ,ములుముడి తాటిపర్తి రోడ్డుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని అని అన్నారు. వీలైనంత త్వరగా ఆ రోడ్డును కూడా పూర్తిచేస్తాం అని తెలిపారు. అదేవిధంగా ఈ మెయిన్ రోడ్డులే కాకుండా చాలా కాలనీలలో దెబ్బతిన్న రోడ్లకు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. నెల్లూరు రూరల్ లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని, ఇందులో భాగంగానే రోడ్లన్నింటిని ఆధునీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు నగర  మేయర్ పోట్లూరి స్రవంతి జయవర్ధన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  ప్రత్యేక చొరవ ఉన్నందున నిధులను సమీకరించుకొని, రోడ్లను ఆధునీకరించడం ప్రజలకు ఎంతో ప్రయోజనకరం అని  తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యమని, వారి అవస్థలను తీర్చడానికి కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి రహదారుల మరమ్మత్తు పనులకు శ్రీకారం చుట్టామని, అతి త్వరలో ఈ రోడ్లని ప్రజల సౌకర్యార్ధం పూర్తిచేస్తాం అని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి విజయ డైరీ చైర్మన్  కొండ్రెడ్డి రంగారెడ్డి, నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర రావు, 41వ డివిజన్ కార్పొరేటర్ కువ్వాకొల్లు విజయలక్ష్మి, వైసీపీ సీనియర్ నాయకులు మిద్దె మురళీ కృష్ణా యాదవ్, నెల్లూరు రూరల్ మండల అధ్యక్షులు బూడిద విజయ్ కుమార్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ మండల కన్వీనర్ ఇందుపూరు  శ్రీనివాస రెడ్డి, జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు షేక్ అల్లాబక్షు, నెల్లూరు రూరల్ మండల ఉపాదక్షుడు పల్లంరెడ్డి రవీంద్ర రెడ్డి, శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం చైర్మన్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, స్థానిక వైయస్సార్ సిపి నాయకులు అద్దంకి కృష్ణ, బెల్లాన్ని మధుసూదన్ రావు, సునీల్ రెడ్డి, కె.పి.ఎన్. ప్రసాద్, కందుకూరు వెంకటేశ్వర్లు ఆచారి, కొండవీటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
 
Tags:MLA Kotamreddy Srikaram for modernization of 7 km asphalt road

Natyam ad