సీసీ డ్రైన్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు

నందిగామ ముచ్చట్లు:
 
నందిగామ పట్టణంలోని 3 వార్డులో నూతనంగా నిర్మించనున్న సీసీ డ్రైనేజ్ నిర్మాణానికి శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు  సోమవారం శంకుస్థాపన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దకాలంగా నందిగామ పట్టణంలో నెలకొన్న మురుగు నీటి పారుదల సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు ,గత ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యలు పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ,ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో నందిగామ పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.నందిగామ పట్టణంలో రూ.10 కోట్ల వ్యయంతో సిసి డ్రైనేజీ ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించామని అందులో భాగంగానే నేడు పట్టణంలోని 3 వ వార్డులో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.80,34,600/- లతో మేజర్ సీసీ డ్రైనేజ్ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించినట్లు తెలిపారు. అదేవిధంగా భవిష్యత్తులో పట్టణంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా మరింత అభివృద్ధి చేసేందుకు గురిచేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు ,అనంతరం డ్రైన్ ల నిర్మాణ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు ,ఈ కార్యక్రమంలో నందిగామ నగర పంచాయతీ చైర్మన్ ,కమిషనర్ ,వైస్ చైర్మన్ లు ,కౌన్సిల్ మరియు కోఆప్షన్ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు .
 
Tags: MLA Mondithoka Jagan Mohan Rao laid the foundation stone for the construction of CC Drains

Natyam ad