MLA Pendirreddy in Sri Ayyappa Vasimi

శ్రీ అయ్యప్పస్వామి దీక్షలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

Date : 06/12/2017

పుంగనూరు ముచ్చట్లు:

కేరళలోని శభరిమలైలో వెలసియుండు శ్రీఅయ్యప్పస్వామి మాలను ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధరించి,దీక్షను చేపట్టారు. సదుం మండలం ఎర్రాతివారిపల్లెలో వెలసియుండు శ్రీ అయ్యప్పస్వామి ఆలయంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి దీక్షను చేపట్టారు. 41 రోజుల పాటు ఆయన కఠోరదీక్షతో అయ్యప్పస్వామి పూజలు నిర్వహిస్తారు. జనవరి 14న మకర సంక్రాంతి రోజున దీక్షను విరమిస్తారు. ఈ సందర్భంగా వందలాది మంది అభిమానులు ఎమ్మెల్యే పెద్దిరెడ్డితో పాటు అయ్యప్ప మాల ధరించి దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా 41 రోజుల పాటు ఎర్రాతివారిపల్లెలోని ఆలయంలో అయ్యప్పభక్తులకు అన్నదానం ప్రతి రోజు నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లె వైఎస్సాఆర్సీపి కన్వీనర్‌ పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, మదనపల్లె వైఎస్సాఆర్సీపి నాయకుడు జింకా వెంకటాచలపతి తదితరులు పాల్గొన్నారు.

Tags : MLA Pendirreddy in Sri Ayyappa Vasimi


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *