ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్న ఎమ్మెల్యే

నర్సాపురం ముచ్చట్లు:
 
నర్సాపురం శాసనసభ్యులు ముదునూరి ప్రసాద్ రాజు  నర్సాపురం నియోజకవర్గ ప్రజల చెవుల్లో పెద్ద పువ్వు పెట్టి నిలువునా నరసాపురం నియోజకవర్గాన్ని భవిష్యత్తుని నట్టేట ముంచి మోసం చేసిన సందర్భం అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు మీడియా సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ భీమవరం తరలి పోయిందని నరసాపురం ప్రజలు ఆవేదనతో బాధతో నరసాపురం విధంగా తగలబడి పోతుంటే శాసనసభ్యులు దర్జాగా పార్టీ కప్ కమిటీలు వేసే హడావిడిలో ఉండటం ఎంతో బాధాకరంగా ఉందని. అంతా పిచ్చనా కొడుకుల్లాగ నర్సాపురం ప్రజలు ఆయన దృష్టిలో ఉన్నారని మాధవ నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాసన సభ్యులు జూలూరి ప్రసాద్ రాజు వందల కోట్లకు అమ్ముడుపోయారని ప్రజలందరూ చెప్పుకుంటున్నారని అన్నారు. ముఖ్యంగా నరసాపురం నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే విన్నవించుకుంటున్నాము అని ప్రజల భవిష్యత్తు కష్టాల్లో ఉందని. పార్టీలకు కులాలకు అతీతంగా రేపు నర్సాపురం నియోజకవర్గంలో ప్రజలు ఒక ర్యాలీగా తరలి వెళ్లి సబ్ కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చి అనంతరం శాసనసభ్యులు గృహానికి వెళ్లి ఆయనను కూడా ఎందుకు ఇలా మోసం చేశారు అని మనం ప్రశ్నిద్దాం అని. అనంతరం సెంటర్లో ధర్నా నిర్వహించాలని భవిష్యత్తు ప్రణాళిక ప్రకారం ఉద్యమ బాటలో ముందుకు వెళ్దామని అన్నారు.
 
Tags: MLA putting flowers in people’s ears

Natyam ad