బాపూజీ నగర్ సమస్యలను పరిశీలించిన ఎమ్మెల్యే ఆర్కే 

మంగళగిరి ముచ్చట్లు:

మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో బాపూజీ నగర్ ఎస్సీ కాలనీ నందు దాదాపు 25 సెంట్ల కామన్ సైట్ నందు కమ్యూనిటీ హాల్ నిర్మించాలని స్థానికులు కోరడంతోఎమ్మెల్యే ఆర్కేఈ స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయావల్సిందిగా కార్పొరేషన్ అధికారులకు సూచనలు చేశారు.ఈ కమ్యూనిటీ హాల్ కి బాబు జగజ్జివన్ రామ్ గారి పేరు పెట్టాలని ఎమ్మెల్యే అన్నారు.ఏప్రిల్ 5వ తేదీన బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవటానికి ప్రతిపాదనలు తయారు చేసి కావలసినటువంటి పర్మిషన్ తీసుకోవాలని కార్పొరేషన్ అధికారులకు సూచనలు చేశారు.అలాగే బాపూజీ నగర్ అంగన్వాడీ కేంద్రం ప్రక్కనే ఉన్న స్థలంలో డ్వాక్రా భవన్ ఏర్పాటు చేయటానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచనలు చేశారు.స్థానిక ప్రజలు నీటి సమస్య ఉందని చెప్పటంతో వెంటనే బోర్ ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు.అలాగే స్థానికంగా ఉన్న రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు.
 
Tags: MLA RK examining Bapuji Nagar issues

Natyam ad