వరల్డ్ రికార్డు సాధించిన బాలిక కు లక్షరూపాయలు అందించిన ఎమ్మేల్యే ఆర్కే రోజా

నగిరి ముచ్చట్లు:
 
నాన్ స్టాప్ 250 కిలోమీటర్స్ సోలో స్కేటింగ్ మారథాన్ వరల్డ్ రికార్డులను 8 సంవత్సరముల బాలిక వెన్సిక సిరి కు అందించిన ఎమ్మేల్యే ఆర్కే రోజా  ఉదయం 6.00 గంటలకు నంగిలి చెక్ పోస్ట్ నుంచి నగరి వరకు 250 కి.మీ.నాన్ స్టాప్ స్కేటింగ్ చేసి వరల్డ్ రికార్డు సాధించిన విషయం తెలిసిందే. పుత్తూరు లో ఆ అమ్మాయికి ఆసియా పసిఫిక్ వరల్డ్ రికార్డ్, గ్లోబల్ వరల్డ్ రికార్డ్ మరియు వజ్రా వరల్డ్ రికార్డు లలో రిజిస్టర్ కాబడి అవార్డులను అందించారు.ఈ కార్యక్రమంలో ఆసియా పసిఫిక్ వరల్డ్ రికార్డ్, గ్లోబల్ వరల్డ్ రికార్డ్ చీఫ్ జడ్జ్ మురుగానందం  మరియు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు కు తరువాతి స్థాయి లో ఉన్న వజ్రా వరల్డ్ రికార్డు చీఫ్ జడ్జ్ తిరుపతి రావు తో కలిసి అవార్డు గ్రహీత కు అవార్డు ప్రదానం చేశారు.Importance of Girl Child Protection అను నినాదం తో ఈ స్కేటింగ్ మారథాన్ లో పాల్గొని అవార్డు సాధించిన వెన్సిక సిరి ను ఆదర్శం గా తీసుకొని ప్రతి ఒక్క తల్లితండ్రులు కూడా ఆడపిల్లలను ఉత్సాహపరిచి వారి యొక్క టాలెంట్ ను బహిర్గతం చేసుకోడానికి అవకాశం కల్పించాలని కోరారు. అదేవిధంగా ఆడపిల్ల అంటే భారం కాదు బంగారం ఈరోజు తల్లితండ్రులు పేదవారు అయినా ఆడపిల్ల ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేశారని కాబట్టి మంచి భవిష్యత్తు కు పునాది గా మారిందని, కాబట్టి ఆడపిల్లను బంగారం లాగా కాపాడుకుంటే తల్లితండ్రుల భారం మొత్తం భవిష్యత్తు లో తీర్చేది ఆడపిల్లే అని తల్లితండ్రులకు, అదేవిధంగా సమాజానికి కూడా మంచి సందేశాన్నిచ్చారు.ఈ అవార్డు సాధించడానికి కారణమైన ప్రతి ఒక్కరినీ సన్మానించారు, అలాగే టాలెంట్ స్కేటింగ్ అకాడమీ ఫౌండర్ అండ్ చీఫ్ కోచ్ ప్రతాప్ సింగ్ ని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ నాన్ స్టాప్ స్కేటింగ్ మారథాన్ వరల్డ్ రికార్డు సాధించిన వెన్సిక సిరి అను 8 సంవత్రముల బాలిక కు తన సొంత డబ్బులు రూ.1,00,000.00 ( అక్షరాలా రూ.ఒక లక్ష) ను ప్రోత్సాహకరంగా అందించిన ఎమ్మేల్యే ఆర్కే రోజా.

Tags; MLA RK Roja donates Rs 1 lakh to world record holder girl

Natyam ad