అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు గని ప్రమాదంపై  ఎమ్మేల్యే  శ్రీధర్ బాబు  దిగ్భ్రాంతి  .                            

-అర్ధరాత్రి సంఘటనా స్థలానికి చేరుకుని సమీక్షించిన శ్రీధర్ బాబు.
మంథని ముచ్చట్లు:
 
సింగరేణి అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు గని ప్రమాదంపై మంథని ఎమ్మేల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సింగరేణి ఏఎల్పి మైన్  ప్రమాదం జరిగిన చోటికి సోమవారం అర్ధరాత్రి వెళ్ళి ప్రమాదం గురుంచి అడిగి తెలుసుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకొని అధికారుల తో కార్మికుల తో ప్రమాదం గురుంచి శ్రీధర్ బాబు తెలుసుకున్నారు.  ఆర్జి ఏఎల్పి  ప్రమాద ఘటన  మైన్ లోకి దిగారు ఘటన వివరాలను సింగరేణి డైరెక్టర్ బలరాం నాయక్ ఇతర అధికారులు ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు ప్రమాద పరిస్థితిని వివరించారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు  చర్యలు చేపట్టాలని, గాయపడిన వారు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్య సేవలు అందించలని సూచించారు. గని ప్రమాదంలో చిక్కుకున్న మిగతా వారు క్షేమంగా తిరిగి రావాలని, ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. భవిష్యత్ లో ఇలాంటివి రిపీట్  కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ బాబు వెంట ఆర్జి3 ఐఎన్టియుసి నాయకులు రామగిరి మండల కాంగ్రెస్ పార్టి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
 
Tags:MLA Sridhar Babu shocked over Adria’s long wall project mine accident
 

Natyam ad