గడప గడపకు ఎమ్మెల్యే బాట

నెల్లూరు ముచ్చట్లు:
 
నిరంతరం ప్రజల్లో ఉండే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఏప్రిల్ 11 నుంచి జగనన్న మాట. గడప గడపకు కోటంరెడ్డి బాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈమేరకు నెల్లూరు రూరల్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ వినూత్న కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ ను బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రకటించారు.నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి పడమరగా ఉన్న గొల్ల కందుకూరు గ్రామం నుంచి జగనన్న మాట. గడప గడపకు కోటంరెడ్డి బాట కార్యక్రమాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రకటించారు. ఏప్రిల్ 11వ తేదీ ఉదయం 9. 15 ఈ కార్యక్రమం ప్రారంభమై దాదాపు సంవత్సరంపాటు కొనసాగుతుందన్నారు.
 
Tags: MLA trail to Gadapa Gadapa

Natyam ad