గంగమ్మ జాతరలో పాల్గోన్న ఎమ్మెల్యే
చిత్తూరు ముచ్చట్లు:
శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర లో భాగంగా ఆలయం వద్ద మంగళవారం నిర్వహించిన తొలి పూజలో తిరుపతి ఎమ్మల్యే భూమన కరుణాకర రెడ్ది పాల్గొన్నారు. ఈ సందర్బంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో భూమన మాట్లాడారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు నిర్వహించే చాటింపుతో తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం అవుతుంది. ఈ దేశంలోనే అత్యంత ప్రాచీనమైన పండగ ఇది. ముఖ్యంగా పేదవాళ్ల పండుగ. మన గ్రామ దేవత పండుగ ఇది. దాదాపు తొమ్మిది వందల సంవత్సరాలుగా గంగమ్మ జాతర జరుగుతోంది. శ్రీ వెంకటేశ్వరస్వామి కి చెల్లెలుగా అమ్మవారికి స్వామి సారె అందుతుంది. ఆనవాయితీ ప్రకారం జాతర ప్రారంభం రోజున వర్షం కురుస్తుంది. ఈ రోజున కూడా ఆరంభానికి శుభసూచకంగా వర్షపు జల్లులు పడుతున్నాయి. ప్రజలందరికీ చాలా మంచి జరుగుతుందనడానికి ఇదో సంకేతం. ఈ సంవత్సరం కూడా జాతరను వైభవోపేతంగా జరపాలని నిర్ణయించడం జరిగింది. తిరుపతి ప్రజల అందరి సహకారంతో శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర అత్యద్భుతంగా జరుగుతుంది. అని భూమన కరుణాకర రెడ్డి పేర్కొన్నారు.
Tags:MLA who participated in the Ganga fair

