షూటింగ్ బాల్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

వికారాబాద్ ముచ్చట్లు:
 
తెలంగాణ స్టేట్ షూటింగ్ బాల్ అసోషియేషన్ ఆధ్వర్యంలో వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్ లో షూటింగ్ బాల్ పోటీలను  స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ శనివారం ప్రారంభించారు.  మూడు రోజుల పాటు జరగనున్న పోటీలు ఉమ్మడి జిల్లాల నుండి పాల్గొన్న విద్యార్థులు ఈ పోటీలలో రాణించిన విద్యార్థులను ఎంపిక చేసి జాతీయ స్థాయికి పంపడం జరుగుతుంది. ఆటలు విద్యార్థుల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయని పిల్లలు మొబైల్ గేమ్స్, క్రికెట్, కంప్యూటర్ లో ఆటలకు కాకుండా ఇలాంటి కొత్తరకమైన ఆటలను ప్రోత్సహించి ఉత్సహంగా పాల్గొనాలని కోరారు వికారాబాద్ ఎమ్మెల్యే…
పిల్లల డాక్టర్ టీ ఆనంద్ మాట్లాడుతూ ఆటలు  పిల్లల్లో మానసిక ఉత్తేజాన్నీ నింపుతాయని హార్మోన్ల ఎదుగుదలకు ఆటలు ఎంతగానో తోడ్పతాయని తెలిపారు. ఆటలు పిల్లను ఆరోగ్యంగా మరియు దృఢంగా చేస్తాయని అన్నారు మూడు రోజులపాటు జరిగే ఈ పోటీలకు తన వంతు కృషిగా వసతి ఆహారం అందిస్తానని అన్నారు..  ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆనంద్, మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్, పిల్లల డాక్టర్ ఆనంద్ లు పాల్గొన్నారు.
 
Tags: MLA who started shooting ball competitions

Natyam ad