అమీన్ పూర్ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు.

సంగారెడ్డి ముచ్చట్లు:
మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారు ఝామునుండే శివాలయాల్లో హర హర మహాదేవ శంభో శంకర .. నినాదాలతో  స్మరించుకుంటు  శివభక్తులు  బారులు తీరారు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్  మున్సిపాలిటీ  పరిధిలోని బీరంగూడ గుట్ట అతి ప్రాచీన మైన 6 వ శతాబ్దం నాటి శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం లో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉదయం నుండే బారులు తీరిన శివ భక్తులు. ప్రత్యేక పూజలకు  ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి , కుటుంబ సభ్యులు హజరయ్యారు.
 
Tags:MLA worship at Aminpur Temple

Natyam ad