ప్రపంచంలోనే మోడీ నెంబర్ వన్

న్యూఢిల్లీ ముచ్చట్లు:
 
భారత ప్రధాని నరేంద్ర మోదీ క్రేజ్‌ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రపచం దేశాధినేతల్లో అత్యంత పాపులారిటీ ఉన్న వ్యక్తిగా మోదీ మరోసారి మొదటిస్థానంలో నిలిచారు. ప్రపంచంలోనే అత్యంత పాపులారిటీ ఉన్న నేతగా మోదీ మొదటిస్థానంలో నిలవడం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం. మార్నింగ్‌ కన్సల్ట్‌ అనే అమెరికా సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. సర్వేలో మొత్తం 72 శాతం మంది మోదీకి పట్టం కట్టడంతో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు ఆరో స్థానం దక్కడం గమనార్హం.ఇదిలా ఉంటే మోదీ తర్వాత 64 శాతం మంది మద్దతుతో మెక్సికో అధ్యక్షుడు లోపెజ్‌ ఓబ్రడార్‌ రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత 57 శాతంతో ఇటలీ ప్రధాని మారియో ద్రాగ్చి మూడో స్థానం దక్కించుకున్నారు. 47 శాతం మంది మద్దతుతో జపాన్‌ ప్రధాని ఫ్యూమిఓ కిషిదా నాలుగో స్థానం, 42 శాతంతో జర్మనీ చాన్స్‌లర్‌ ఒలాఫ్‌ ఘాల్జ్‌ ఐదవ స్థానంలో నిలిచారు. ఇక అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ కేవలం 41 శాతంతో ఆరో స్థానం సరిపెట్టుకోవాల్సి వచ్చింది.అయితే ఆరో స్థానాన్ని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌, ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్‌, కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడూలు సంయుక్తంగా పంచుకున్నారు. వీరికి కూడా 41 శాతం మంది మద్దతు లభించింది. ఇక టాప్‌లో ఉన్న నిలిచిన వారిలో 37 శాతంతో స్పెయిన్‌ ప్రధాని పెడ్రో శాంచెజ్ ఏడో స్థానం. 36 శాతం ఓట్లతో బ్రెజిల్ అధ్యక్షుడు జయర్ బోల్సోనారో 8వ ర్యాంకు, 35 శాతం ఓట్లతో ఫ్రాన్స్ ప్రధాని ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ 9వ ర్యాంకు, 30 శాతం మంది ఆమోదంతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ 10వ ర్యాంకు దక్కించుకున్నారు.
 
Tags: Modi is number one in the world

Natyam ad