విద్యార్ధులతో మోడీ ముచ్చట.

న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో ముచ్చటించారు. విద్యార్థులు తమ అనుభవాలను ఆయనతో పంచుకున్నారు. వారణాసితో పాటు ఉత్తరప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి క్షేమంగా తిరిగి వచ్చారు.యుద్ధభూమి ఉక్రెయిన్ నుండి ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు తిరిగి వచ్చారు. యూపీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో విద్యార్థుల బృందంతో గురువారం సంభాషించారు. సందర్భంగా ప్రధాని మోడీతో విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు.ప్రధానమంత్రి వారణాసి నియోజకవర్గం లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రష్యా దాడికి గురైన ఉక్రెయిన్ నుండి భారతీయ పౌరులను, ఎక్కువగా విద్యార్థులను తరలించడానికి ప్రభుత్వం “ఆపరేషన్ గంగా” ప్రారంభించింది.భారతీయులను తరలింపు ప్రయత్నాలను సమన్వయం చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే నలుగురు కేంద్ర మంత్రులను ఉక్రెయిన్ పొరుగు దేశాలకు ప్రత్యేక రాయబారులుగా పంపింది. దీంతో ఉక్రెయిన్‌లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్నవారిని ప్రత్యేక విమానాల ద్వారా క్షేమంగా తరలిస్తున్నారు.
 
Tags:Modi mesmerizes with students

Natyam ad