Modi's wife wants to remove security

మోదీ భార్యకు భద్రత తొలగించాలని దీక్ష

Date: 08/01/2018

హైదరాబాద్ ముచ్చట్లు:

ప్రధానమంత్రి నరేంద్రమోదీ భార్యకు ఉన్న జెడ్ కేటగిరీ భద్రతను తొలగించాలని, లేకపోతే ఆమెను మోదీ భార్యగా అంగీకరించాలని డిమాండ్ చేస్తూ అఖండ భారత ఉద్యమ వ్యవస్థాపకురాలు డాక్టర్ పాలెపు సుశీల ఆరు రోజులుగా నిరాహారదీక్షను చేపట్టారు. హైదరాబాద్ మియాపూర్‌లోని న్యూ హఫీజ్ పేటలో ఆమె క్లినిక్ నడుపుతున్నారు. ఈ సందర్భంగా ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ జశోదబెన్‌తో తన వివాహం చెల్లదని మోదీ చెబుతున్నారని, ఈ నేపథ్యంలో ఆమెకు జెడ్ కేటగిరీ భద్రతను ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. మరోవైపు తనకు ఏ హోదాలో భద్రతను కల్పిస్తున్నారో తెలపాలంటూ సమాచార హక్కు చట్టం కింద జశోదాబెన్ దరఖాస్తు చేసుకున్నారు. తాను ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణిస్తుండగా, తన భద్రతా సిబ్బంది ప్రత్యేక వాహనాలు వాడుతుండటం తనకు చాలా ఇబ్బందిగా ఉందని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ప్రధాని భార్యకు ప్రొటోకాల్ ప్రకారం ఇంకా ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారని ఆమె ప్రశ్నించారు. మోదీ తన పాస్ పోర్టులో భార్యకు సంబంధించి ఎలాంటి వివరాలు పొందుపరిచారో కూడా తెలియజేయాలని ఆర్టీఐ అధికారులను కోరారు.

Tags: Modi’s wife wants to remove security

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *