ముస్లింల సంప్రదాయాలను గౌరవించిన ప్రధానిమోదీ -హర్షం వ్యక్తం చేసిన ముస్లిం సోదరులు

గుజరాత్‌ ముచ్చట్లు :

భారతదేశ ప్య్రధానమంత్రి నరేంద్రమోదీ ముస్లిం సంప్రదాయాలను తనదైనశైలిలో గౌరవిస్తూ ప్రతిపక్షాలను విస్మయానికి గురిచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానిమోదీ గుజరాత్‌లో ప్రసంగించారు. ఆ సమయంలో సమీపంలోని మసీదు నుంచి ముస్లిం ప్రార్థనలు ప్రారంభమైంది. దీనిని గమనించిన ప్రధాని మోదీ హాఠాత్తుగా ప్రసంగాన్ని ఆపివేసి, నిశ్శబ్ధం అంటు ప్రజలను హెచ్చరించారు. హజాప్రార్థనలు పూర్తికాగానే తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ హఠాత్‌పరిణామాన్ని ముస్లింలు స్వాగతించారు. ప్రధానిమోదీ మనస్పూర్తిగా ముస్లింలను గౌరవించారని కొనియాడారు. ప్రతిపక్ష పార్టీలు మాత్రం దీనిని ఖండించారు. హిందూతత్వ ప్రధానిగా మోదీ తన పరిపాలన చాటుకుంటు ఎన్నికల కోసం ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా ప్రధాని గుజరాత్‌ పర్యటన ముస్లింలలో చర్చనీయాంశమైంది.

Tag : moody-is-a-respected-muslim-tradition

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *