More and more granite stones are sold

యదేఛ్చగా గ్రానైట్ రాళ్ల విక్రయం

Date:16/11/2018
ఒంగోలు ముచ్చట్లు:
రోడ్డును అడ్డాగా చేసుకుని గ్రానైట్‌ మీటరు, ముడి రాళ్లను క్వారీ నుంచి దొర్లించటంతో తారు రోడ్డు సైతం మట్టిరొడ్డుగా మారి రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. కోట్లు వెచ్చించి ఇటీవల అభివృద్ధి పరచిన రోడ్డును క్వారీదార్లు తమ ఆధీనంలోకి తీసుకున్నా అధికార్లు చూసీ చూడనట్లుగానే వ్యవహరిస్తున్నారు. అడిగేవారే లేక పోవటంతో వేళాపాళా లేకుండా బ్లాస్టింగ్‌ మోతలు అధికమయ్యాయి. బ్లాస్టింగ్‌ మోతలతో వాహన చోదకులు బెంబేలెత్తుతున్నారు.మండలంలోని చెన్నుపల్లి అనంతవరం ఆర్‌అండ్‌బీ రోడ్డులో కొండాయపాలెం గ్రామం నుంచి వేమవరం వరకు 7.6 కిలో మీటర్లను ఇటీవల రూ. 8 కోట్లతో డబుల్‌ రోడ్డుగా విస్తరించి అభివృద్ధి పరిచారు. ఈ రోడ్డులోనే కొండాయపాలెం–మల్లాయపాలెం గ్రామాల మధ్య కొణిదెన రెవెన్యూలోని ఈర్లకొండ విస్తరించి ఉంది. కొండలోని సూమారు 5 హెక్టార్లను లీజుకు తీసుకున్నారు. ఈ రోడ్డు ఇరువైపులా మార్జిన్‌లో గ్రానైట్‌ మీటరు ముడిరాళ్లను నిల్వ చేస్తున్నారు. అక్కడే లారీలను నిలిపి లోడింగ్‌ చేస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పటంలేదు. రోడ్డుపైనే క్రేన్‌లతో ఇటీవల నిర్మించిన తారు రోడ్డు సైతం మూన్నాళ్ల ముచ్చటగా మారి రూపం కోల్పోతోంది. ఈ  పరిస్థితులకు తోడు వేళాపాళా లేకుండా బ్లాస్టింగ్‌ మోతలతో వాహన చోదకులు, ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.
Tags:More and more granite stones are sold

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *