మరింత మధురంగా తిరుమల లడ్డూ

తిరుమల ముచ్చట్లు:
 
తిరుమల శ్రీవారి లడ్డూకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ తిరుమల లడ్డూ అంటే ఎంతో మంది ఇష్టపడుతుంటారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో, విదేశాల్లో సైతం తిరుమల లడ్డుకు ప్రత్యేక స్థానం ఉంది. శ్రీవారి లడ్డూను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇక నుంచి ఈ లడ్డూ మరింత రుచిగా ఉండనుంది. లడ్డూ తయారీకి అవసరమైన ముఖ్యమైన పదార్థాలు చక్కెర, నెయ్యితో పాటు శనగపిండి. అయితే ఎప్పుడు ఆ శనగపిండికి అవసరమైన పప్పును అనంతపురం జిల్లా నుంచి పంపిస్తున్నారు.పూర్తిగా ప్రకృతి సిద్ధంగా సాగు చేసిన పంటను సేకరించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. వ్యవసాయ విభాగం డీపీఎం లక్ష్మానాయక్‌ సహకారంతో ఈనెలాఖరున అవసరమైన పప్పు శనగను శ్రీవారి సన్నిధికి చేర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జీరో బేస్డ్‌ నాచురల్‌ ఫార్మింగ్‌  విభాగం ఆధ్వర్యంలో తాడిపత్రి మండలం బొందలదిన్నె గ్రామంలో 57 మంది రైతులు సహజ విధానంలో సాగు చేసిన 185 ఎకరాల్లోని 1,396 క్వింటాళ్ల పప్పుశనగకు ఇటీవల టీటీడీ నుంచి ఆర్డర్‌ వచ్చినట్లు డీపీఎం లక్ష్మానాయక్‌ తెలిపారు. అయితే ఎక్కడా రసాయనాలు, పురుగుల మందులు వాడకుండానే ఈ పంట సాగు అవుతోంది. పూర్తిగా ఆవుపేడ, ఆవు మూత్రం, బెల్లం, శనగపిండి లాంటి పదార్థాలతో తయారు చేసిన సేంద్రియ పోషకాలను ఈ పంటకు వాడుతున్నారు. అలాగే పప్పుశనగలో అంతర్‌ పంటగా సజ్జలు, అనుము, అలసందత పాటు అవాలు కూడా వేశామని అన్నారు.ప్రత్యేకంగా సాగు చేస్తున్న ఈ పంట ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అయితే ఈ నెలాఖరు వరకు 1,396 క్వింటాళ్లు తిరుమలకు పంపించడానికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. బహిరంగ మార్కెట్లో ఉన్న ధర కంటే 20 శాతం అధికంగా రైతులకు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే క్వింటాలుకు కనీసం రూ.7వేల వరకు పలికే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
 
Tags: More sweet tirumala laddu

Natyam ad