Morgan Robert Sun wrote about 'Titanic'!

‘టైటానిక్‌’ గురించి మోర్గాన్‌ రాబర్ట్‌ సన్‌ రాసాడు!

Date : 14/12/2017

హైదరాబాద్‌ ముచ్చట్లు:

జేమ్స్‌ కామెరాన్‌ ఆస్కార్‌ అవార్డుల పంటను పండించడానికి ఒక వందేళ్ళ ముందే మోర్గాన్‌ రాబర్ట్‌సన్‌ అనే రచయిత వెర్రిపుచ్చకాయ టైపు పుస్తకాన్ని రాసాడు ? ఫ్యుటిలిటీ, ఆర్‌ ద రెక్‌ ఆఫ్‌ ది టైటాన్‌ అన్న పేరుతో. ఈ కథంతా మునిగిపోలేని ఓడ ఒకటి మునిగిపోవడం చుట్టూ తిరుగుతుంది. ఈ పుస్తకం కవర్‌ పేజీ చూస్తే ముక్కున వేలేసుకోవాలి. టైటానిక్‌ సినిమాలో ఓడ మునిగేప్పుడు చూపించే దృశ్యాన్నే ఆ కవర్‌ పేజ్‌ మీదా చూడొచ్చు. టైటానిక్‌ షిప్‌ మునిగిపోయాక దాని మునక ఆధారంగా పదమూడు సినిమాలొచ్చాయి, కామెరాన్‌ సినిమా కాక. ఇవన్నీ కామెరాన్‌ సినిమా కంటే కూడా పాతవి. వీళ్ళందరికన్నా ముందుగా మొదటివరసలో ఉండాలన్న తపనో ఏమో రాబర్ట్‌ సన్‌ పుస్తకమే ఈ మునకపై వచ్చిన మొట్టమొదటి కథ. అసలు రాబర్ట్‌ సన్‌ తొందరపాటు ఎంతవుందంటే అతను టైటానిక్‌ తయారై, మునిగిపోయేంత వరకు కూడా ఆగలేకపోయాడు. టైటానిక్‌ ఓడ 1912లో మునిగిపోయింది. కానీ రాబర్ట్‌సన్‌ 1898లోనే అంటే పద్నాలుగేళ్ళ ముందుగానే పుస్తకం రాసేసాడు. విచిత్రాలు ఇక్కడితో ఆగలేదు.

Tags : Morgan Robert Sun wrote about ‘Titanic’!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *