కొల్లేరు రైతులతో ఎంపీ మాగంటి బాబు భేటీ

Date:18/06/2018
ఏలూరు ముచ్చట్లు:
కొల్లేరు ప్రజలకు న్యాయం జరిగిందని భవిష్యత్తులో ఒకవైపు పర్యాటక ప్రాంతంగా కొల్లేరును అభివృద్ధి చేస్తూ కొల్లేరు ప్రజల జీవన స్ధితిగతులు మెరుగుపరిచేందుకు 22 వేల ఎ కరాల భూమిని కొల్లేరు రైతులకు అందించనున్నట్లు ఏలూరు యంపి మాగంటి బాబు చెప్పారు. స్ధానిక రామచంద్రరావుపేటలోని యంపి కేంపు కార్యాలయంలో సోమవారం కొల్లేరు రైతులు మాగంటి బాబును కలిసి తమ చిరకాలకోరికను తీర్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 7500 కోట్ల రూపాయల విలువైన 22 వేల ఎ కరాల భూములను కొల్లేరులోని 136 సొసైటీలు, జిరాయితీ రైతులకు అందించడానికి ప్రభుత్వం చర్యలుతీసుకున్నదని ఇది కొల్లేరు ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న మంచి అవకాశమని ఆయన చెప్పారు. 77 వేల ఎ కరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న కొల్లేరు సరస్సులో 55 వేల ఎ కరాలలో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ఉప్పుటేరు వద్ద రెగ్యులేటర్‌ను కూడా ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. 22 వేల ఎ కరాలు కొల్లేరు వాసులకు పంపిణీ చేసి కొల్లేరు ప్రజల పూర్వ వైభవాన్ని తీసుకువస్తామని కొల్లేరు వాసులంతా ఆనందోత్సాహాలతో ఉన్నారని గత దశాబ్దకాలంగా కొల్లేరు ప్రజలు ఎ న్నో అష్టకష్టాలు పడ్డారని తింటానికి తిండికూడా లేక ఇబ్బందులు పడుతున్న కొల్లేరు వాసుల సమస్యను పరిష్కరించాలని అనేకసార్లు ఢిల్లీకి తీసుకువె ళ్లి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడంకూడా జరిగిందనిఅన్నారు. అయినా సుప్రీంకోర్టు సాధికారిత పరిధిలో ఈసమస్య ఉండడంతో ఎ వరూ కూడా కొల్లేరు సమస్య పరిష్కారానికి సాహసం చేయలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 22 వేల ఎ కరాల కొల్లేరుభూమిని డీనోటిఫై చేయడానికి నిర్ణయం తీసుకోవడం కొల్లేరు ప్రజల అదృష్టంగా భావిస్తున్నామని మాగంటి బాబు చెప్పారు. కొల్లేరును పర్యాటకప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన బడాపారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ఆయన కోరారు. కొల్లేరు ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకోసం అనేక చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన చెప్పారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోగా 18 అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా జరిగే పలు కార్యక్రమాలలో యంపీలు అంతా విస్తృతంగా పాల్గొనాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మాగంటి బాబు చెప్పారు. ఈనెల 20వ తేదీన కడప ఉక్కు ఫ్యాక్టరీకోసం సియం రమేష్ చేపట్టే ఆమరణనిరాహారదీక్షకు సంఘీభావంగా ఈనెల 22వ తేదీన తాను కడప వెళుతున్నానని కడప ఉక్కు ఆంధ్రులహక్కు అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం నుండి కడప ఉక్కు ఫ్యాక్టరీకి అనుమతి పొందేలా పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. ఆయిల్ ఫామ్ రైతుల సంక్షేమం కోసం పొగాకు రైతులకు గిట్టుబాటుధర కల్పించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటికే ఆయిల్ ఫామ్ రైతులకు రెండుశాతం అదనపు రాయితీ కల్పించడం జరిగిందని మాగంటి బాబు చెప్పారు. ఈముపక్షుల పెంపకందార్ల సంక్షేమం కోసం 170 కోట్ల రూపాయలు రాయితీ ఇవ్వడం జరిగిందని అయన చెప్పారు. ఆక్వారైతులకు విద్యుత్తు బిల్లులో యూనిట్ కు 2 రూపాయలు రాయితీ ఇవ్వడం వలన ఆక్వారైతులు ఎ ంతో సంతోషిస్తున్నారని అదేవిధంగా నిరుద్యోగ యువతకు నెలకు 1000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వడం వలన ఏటా 1200 కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయింపు జరిగిందని మాగంటి బాబు చెప్పారు.
Tags:MP Maganti Babu meeting with farmers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *