MPP, JPPTC, which started 5K run in the biggest span

పెద్దపంజాణిలో 5 కె రన్ ప్రారంభించిన ఎంపీపీ, జెడ్పీటీసీ

Date : 07/01/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

మండల పరిధిలోని బట్టందొడ్డి, పెద్దారికుంట గ్రామాల్లో జరిగిన జన్మభూమి – మా ఊరు కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులచే 5 కె రన్ కార్యక్రమాన్ని ఎంపీపీ మురళీకృష్ణ, జెడ్పీటీసీ సులోచన ప్రారంభించారు. అనంతరం జరిగిన జన్మభూమి గ్రామ సభలలో పాల్గొని పింఛనులు, రేషన్ కార్డులు, నూతన గృహనిర్మాణాలకోసం ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. తెదేపా ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తుందని తెలిపారు. మరుగుదొడ్లు లేనివారిని గుర్తించి సత్వరమే వారికి మరుగుదొడ్లు నిర్మించి ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు సురేంద్ర, ఎంపీడీఓ వెంకటరత్నం, వివిద శాఖల అధికారులు, నాయకులు సుధాకర్ రెడ్డి, రామక్రిష్ణ, మురహరి రెడ్డి, రోజాక్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: MPP, JPPTC, which started 5K run in the biggest span

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *