ఏపికి ప్రత్యేక హోదాకోసం ఎంపిలు రాజీనామా చేయాలి 

-నేసనల్ కమ్యునిస్ట్ పార్టీ డిమాండ్
– ప్రత్యేక హోదా కోసం 28 న గుంటూరు లో భారీ ర్యాలి
Date:15/02/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
రాష్ట్ర విభజనతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని,విభజన సందర్బంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించి మోసం చేసారని నేసనల్ కమ్యునిస్ట్ పార్టీ (ఎన్.సి.పి )తెలుగు రాష్ట్రాల అధికార ప్రతినిధి సుంకరి కొండలు విమర్చించారు.గురువారం  హైదరాబాద్ లో మీడియా సమావేశం లో పార్టీ గుంటూరు జిల్లా సహాయ కార్యదర్శి మందా భూషణం యునైటెడ్ బహుజన పోరాట సమితి(యుబిఎస్పి) కన్వినర్ కే.తిరుపతి నాయుడు లతో కలిసి మాట్లాడారు.ప్రత్యెక హోదా విషయం లో బిజెపి, టిడిపి లు డ్రామాలడుతున్నాయని వారు విమర్శించారు.ప్రత్యేక హోదాకోసం అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఎంపి లు రాజీనామా చేయాలనీ వారు డిమాండ్ చేసారు.ప్రత్యేక హోదాకోసం ఎన్.సి.పి,యుబిఎస్పిల ఆద్వర్యం లో ఈ నెల 28 న గుంటూరు లో భారీ ర్యాలీ,సభను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.ప్రస్తుత పార్ల మెంట్ సమావాశాల్లో ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంట్లో చేస్తున్న పోరాటాన్ని వారు అభినందించారు.ఏప్రిల్ 5 తేది లోపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని పక్షం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపి లు రాజీనామా చేస్తారని ఆ పార్టీ అద్యక్షులు జగన్ మోహన్ రెడ్డి ప్రకటించడాన్ని వారు  స్వాగతించారు.జగన్ తరహాలోనే మిగతా పార్టీల ఎంపి లు తమ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించాలని సుంకరి కొండలు డిమాండ్ చేసారు.కేంద్ర బర్జట్ లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు.రాష్ట్రానికి నిధులకోసం డిల్లికి అఖిల పక్షాన్ని తీసుకెల్లి కేంద్రం ఫై వత్తిడి చేయాలని వారు ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడిని డిమాండ్ చేసారు.
Tags: MPs should resign for special status

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *