రాష్ట్రస్థాయి కుంఫు కరాటే క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎమ్ ఎస్,ఎం ఈ రాష్ట్ర డైరెక్టర్

నెల్లూరు ముచ్చట్లు:
ఎం ఎస్ ఎం ఈ  రాష్ట్ర డైరెక్టర్ షేక్. కరీముల్లా మార్చి 6న వేదయపాలెం ఏ, వి ,ఎస్ కళ్యాణ మండపంలో జరిగే రాష్ట్రస్థాయి కరాటే కుంఫూ క్యాలెండర్ను నేడు  వారి కార్యాలయంలో క్రీడాకారుల మధ్య ఆవిష్కరించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరాటి ,కుంపూ, అనే కళ చైనాలో పుట్టి ,పలు దేశాలకు వ్యాప్తి చెందిందని ఈ సాధన చేస్తే విశ్వాసం, సంతులనం, బలం,  ఆత్మ ధైర్యం, వస్తుందని ఈ కళని నేర్చుకోవడం వల్ల మనకు హాని కలిగినప్పుడు మరియు ఎవరినైనా రక్షించడానికి సహాయపడుతుందని విద్యార్థులు ముఖ్యంగా యువత కరాటే మార్షల్ ఆర్ట్స్ లో భాగస్వాములు కావాలని దీనివల్ల ముఖ్యంగా ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా అందంగా ఉంటారని ఈ సందర్భంగా ఏపీ స్టేట్ మార్షల్ ఆర్ట్ గౌరవ అధ్యక్షులు షేక్ కరీముల్లా   తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల రీత్యా ప్రతి ఒక్కరూ ఆత్మరక్షణ పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు బాలికలు ఆత్మరక్షణ పై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహిళలు బాలికల రక్షణకై తండ్రి అన్న భర్త నామకరణతో రక్షకులుగా ఉంటారని తెలిపారు. అయితే కొన్ని ఈ కారణాల రీత్యా, మహిళలు ఆత్మరక్షణ పై కనీస పరిజ్ఞానం ఖచ్చితంగా ఉండాలన్నారు. మార్చ్ 6న జరగనున్న మార్షల్ ఆర్ట్స్ పోటీల కార్యక్రమానికి అర్హత అనుభవం తో పాటు ఈ పోటీల్లో పాల్గొనాలనే అభిలాష ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.
Tags:MS, M is the state director who unveiled the state-level kumfu karate calendar

Natyam ad