ప్రతి గంటకు ముచ్చింతల్  బస్సు

హైదరాబాద్ ముచ్చట్లు:
 
ముచ్చింతల్‌లోని చినజీయర్‌ స్వామి ఆశ్రమం శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు సిద్ధమవుతోంది.  సమతామూర్తి పేరిట నిర్మించిన 216 అడుగుల శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ ముచ్చింతల్‌ పర్యటన ఖరారైంది. పీఎం కార్యాలయం నుంచి జీయర్‌స్వామి ఆశ్రమానికి సమాచారం అందింది. శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం ఇస్తారు ప్రధాని మోదీ. దాదాపు 4 నుంచి 5 గంటలపాటు మోదీ పర్యటన కొనసాగనుంది. 35 ఎకరాల విస్తీర్ణంలో 144 యాగశాలలు నిర్మించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 5వేల మంది రుత్వికులు, వేదపండితులు విచ్చేసి క్రతువులో పాల్గొంటారని సమాచారం. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా వస్తుండడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం 120 కిలోల బంగారంతో 54 అంగుళాల రామానుజచార్యుల విగ్రహం ప్రతిష్టనించనున్నారు. కాగా ప్రధాని ఫిబ్రవరి 5న రానుండడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. ఆయన భద్రత కోసం సుమారు 7వేల మంది పోలీసులు రక్షణ కల్పించనున్నారు. కాగా ప్రధాని నేరుగా ఢిల్లీ నుండి ముచ్చింతల్ ఆశ్రమంలోనే దిగనున్నారు.శ్రీ రామానుజులవారి సహస్రాబ్ది ఉత్సావాలను పురస్కరించుకొని ముంచింతలలో ఏర్పాటుచేసిన 216 అడుగుల ఎత్తుగల రామానుజులవారి సమతామూర్తి విగ్రహావిష్కరణ,108 సాలగ్రామ విష్ణు మూర్తుల ఉపాలయాలు,1035 యజ్ఞ కుండికలతో మరియు 5000 ఋత్వికులతో జరిపే మహాయజ్ఞం చూడటానికి ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుండి ముచ్చింతల్‌కు బస్సులను అందుబాటులో ఉంచనున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇదే అంశాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు.హైదరాబాద్ నగరంలో పలు బస్ స్టేషన్‌ల నుండి బస్సులు ప్రతి గంటకు బయలు దేరనున్నాయి. ఈ క్రమంలోనే ఎంజీబీఎస్ , జేబీఎస్ , సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తోపాటు కాచిగూడా రైల్వే స్టేషన్‌ల నుంచి బస్సులు ఉదయం ఆరు గంటలకు, ఏడు గంటలకు, ఎనిమిది గంటలకు బస్సులు బయలు దేరనున్నాయి.
 
Tags: Muchhinthal bus every hour

Natyam ad