Mukesh Kumar Meena was angry at the delay in Swadeshi DarshanMukesh Kumar Meena was angry at the delay in Swadeshi Darshan

స్వ‌దేశీ ద‌ర్శ‌న్ ప‌నుల‌లో జాప్యంపై ముఖేష్ కుమార్ మీనా ఆగ్ర‌హం

-గ‌డువు లోపు పూర్తి చేయాల‌ని ఆదేశం
Date:21/05/2018
అమరావతి  ముచ్చట్లు:
ప‌ర్యాట‌క సౌక‌ర్యాల క‌ల్ప‌న‌ను నిర్ధేశించిన సివిల్ ఇంజ‌నీరింగ్ ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని, గ‌డువు లోపు పూర్తి చేయాల‌ని ప‌ర్యాట‌క‌, భాషా, సాంస్కృతిక‌ శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్ కుమార్ మీనా స్ప‌ష్టం చేసారు. వంద‌ల కోట్ల రూపాయ‌ల నిధులు అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ ప‌నుల‌లో నిర్ధేశిత వేగం లోపించ‌టంపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. సోమ‌వారం వెల‌గ‌పూడి స‌చివాల‌యం, మూడ‌వ బ్లాక్‌లోని కాన్ప‌రెన్స్  హాల్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ టూరిజం అధారిటీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క అభివృద్ది సంస్ధ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, వార‌స‌త్వ బోర్డుల‌ నేతృత్వంలో జ‌రుగుతున్న వివిధ ప‌నుల‌పై మీనా ఉన్న‌త స్ధాయి స‌మీక్ష నిర్వ‌హించారు. ఎపిటిడిసి ఎండి హిమాన్హు శుక్లా వివిధ ప‌నుల పురోగ‌తి గురించి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా మీనాకు వివ‌రించారు. ప్ర‌త్యేకించి కేంద్ర ప్ర‌భుత్వ ప‌ధ‌కం స్వ‌దేశీ ద‌ర్శ‌న్ నిధుల‌తో చేప‌ట్టిన ప‌నుల‌పై మీనా దృష్టి సారించారు. స‌కాలంలో ప‌నులు ప్రారంభించి, పూర్తి చేయ‌క‌ పోతే కేంద్రం నిధుల‌ను ర‌ద్దు చేసే అవ‌కాశం ఉంద‌ని, జూన్ 15వతేదీ నాటికి అన్ని ర‌కాల ప‌నులు ప్రారంభం కావాల‌ని  హెచ్చ‌రించారు. అల‌సత్వాన్ని అంగీక‌రించ‌బోమ‌ని, ఇంజ‌నీరింగ్ విభాగం చేప‌ట్టే ప‌నుల పురోగ‌తిపై త‌న‌కు ఎప్ప‌టి క‌ప్పుడు స‌మాచారం అందించాల‌ని ఎపిటిడిసి ఇడి (ప్రాజెక్ట్సు)  టివిఎస్‌జి కుమార్‌ను అదేశించారు.  ఇక‌పై ప్ర‌తి శుక్ర‌వారం సివిల్ ఇంజ‌నీరింగ్ ప‌నుల‌పై తాను స‌మీక్ష నిర్వ‌హిస్తాన‌ని, స్వ‌యంగా ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తాన‌ని స్ప‌ష్టం చేసారు. ముఖ్య‌మంత్రి ఇచ్చిన హామీల‌కు సంబంధించిన ప‌నుల‌లో కూడా జాప్యం జ‌ర‌గ‌టంపై ఎపిటిడిసి సూప‌రిండెంట్ ఇంజ‌నీర్ గంగాధ‌ర రెడ్డిని తీవ్రంగా మంద‌లించారు. నిర్మాణ ప‌నుల‌కు సంబంధించి వివిధ శాఖ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం సాధించాల‌ని, అందుకు అవ‌స‌ర‌మైతే అయా శాఖ‌ల‌ను నేరుగా సంప్ర‌దించాల‌ని మీనా అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌త్యేకించి దేవాదాయ, అట‌వీ శాఖల‌ ప‌రంగా ఉన్న ఇబ్బందుల‌ను అధిక‌మించాల‌ని, ప్ర‌తి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ఉంటుంద‌న్నారు.స్వ‌దేశీ ద‌ర్శ‌న్ ప‌నుల‌కు సంబంధించి త‌క్ష‌ణ‌మే శ్రీ‌శైలం దేవ‌స్ధానం ఇఓతో స‌మావేశం కావాల‌ని టివిఎస్‌జి కుమార్ కు సూచించారు. స‌మావేశం వివ‌రాల‌ను త‌క్ష‌ణ‌మే త‌న దృష్టికి తీసుకురావాల‌ని కోరారు. ప‌ర్యాట‌క శాఖ‌లో నిధుల కొర‌త లేద‌న్న మీనా, బొబ్బిలి కోట‌లో ఏర్పాటు చేయ‌త‌ల‌పెట్టిన సౌండ్ అండ్ లైట్ షోకు అద‌న‌పు నిధులు మంజూరు చేసేందుకు అంగీక‌రించారు. ప్ర‌త్యేకించి ముఖ్య‌మంత్రి దృష్టిలో ఉన్న హౌస్ బోట్స్ నిర్మాణం త‌క్ష‌ణ‌మే పూర్తి కావాల‌ని, రానున్న మూడు నెల‌ల వ్య‌వ‌ధిలో కృష్ణాన‌దిలో వాటిపై ప‌ర్యాట‌కులు విహ‌రించాల‌ని ప‌ర్యాట‌క‌, భాషా, సాంస్కృతిక‌ శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్ కుమార్ మీనా ఎండి హిమాన్హు శుక్లాకు సూచించారు. ప‌ర్యాట‌కుల‌కు ఆస‌క్తి క‌లిగించే రోప్‌వేలు పూర్తి కావాల‌న్నారు. గండికోట సాహాస క్రీడ‌ల అకాడ‌మీకి సంబంధించిన పురోగ‌తిపై త‌న‌కు రోజువారి నివేదిక‌లు ఇవ్వాల‌ని, ఆర‌కు అభివృద్దికి సంబంధించిన ప‌నుల ప‌ట్ల ప్ర‌త్యేక శ్ర‌ద్ద వ‌హించాల‌ని మీనా స్ప‌ష్టం చేసారు.
Tags:Mukesh Kumar Meena was angry at the delay in Swadeshi Darshan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *