పుంగనూరులో 31న మున్సిపల్‌ సమావేశం

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి సాధారణ సమావేశం ఈనెల 31 ఉదయం 11 గంటలకు జరపనున్నట్లు చైర్మన్‌ అలీమ్‌బాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటి పరిధిలోని 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టాల్సిన పనులకు ప్రతిపాదనలు సిద్దం చేయడం జరిగిందన్నారు. అలాగే కంపోస్ట్ యార్డులో రూ.5 లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటు, వరదల్లో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులతో పాటు మున్సిపాలిటి నిధుల నుంచి చేపట్టాల్సిన పనుల గురించి చర్చించనున్నట్లు తెలిపారు. సభ్యులు, అన్నిశాఖల అధికారులు తప్పక హాజరుకావాలెనని కోరారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: Municipal meeting on 31st at Punganur

Natyam ad