పుంగనూరులో నాలుగుఅంతస్తుల అద్దె భవనాలకు మున్సిపల్‌ ట్యాప్‌లు

-యజమానులకు కాసుల వర్షం
 
పుంగనూరు ముచ్చట్లు:
 
మున్సిపాలిటిలోని గృహ యజమానులు ఇండ్లను అద్దెకు ఇచ్చి మున్సిపల్‌ ట్యాప్‌ల ద్వారా నీరు వినియోగించుకుంటు, అద్దెతో పాటు నీటికి డబ్బులు వసూలు చేస్తున్నారని అద్దెదారులు ఆరోపిస్తున్నారు. శనివారం మున్సిపల్‌ కమిషనర్‌ రసూల్‌ఖాన్‌ కు ఫిర్యాదు చేశారు. పట్టణంలోని కొత్తయిండ్లు, సూర్యనగర్‌రోడ్డు, కృష్ణమరెడ్డిపల్లె రోడ్డు, కొత్తపేట, ఎల్‌ఐసీ కాలనీ, ఎన్‌జీవో కాలనీ, ఎంబిటి రోడ్డు, గోకుల్‌ సర్కిల్‌, గోకుల్‌ కళ్యాణ మండపం వద్ద, బిఆర్‌ •యెటర్‌ రోడ్డు, కోర్టురోడ్డు ప్రాంతాలలో గృహ యజమానులు మూడు, నాలుగు అంతస్తుల భవనాలు నిర్మించి అద్దెకు ఇస్తున్నారు. మున్సిపాలిటి వద్ద ఇంటికి నీటి కనెక్షన్‌ తీసుకుని వాటికి పెద్ద సంపులు ఏర్పాటు చేసి, మున్సిపల్‌ ట్యాప్‌కు నేరుగా కరెంటు మోటార్లు పెట్టి, నీటిని వాడుకుంటున్నారని పేర్కొన్నారు. మున్సిపల్‌ నిబంధనల మేరకు కమర్షియల్‌ క్రింద మున్సిపల్‌ కొళాయిలను మంజూరు చేయాల్సి ఉంది. కానీఇందుకు విరుద్దంగా యజమానులు నీటిని వాడుకుంటు అద్దె యజమానుల వద్ద నీటికి ప్రతినెల డబ్బులు వసూలు చేయడం గమనార్హం. దీని కారణంగా మున్సిపాలిటికి లక్షలాది రూపాయల నీటి పన్నుకు గండి కొడుతున్నట్లు తెలిసింది. ఇలా నీటి చౌరాన్ని అరికట్టకపోతే సామాన్య ప్రజానికానికి నీటి సమస్య తప్పదు. ఈ విషయమై కమిషనర్‌ రసూల్‌ఖాన్‌ను విచారించగా ఆయన మాట్లాడుతూ దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.
 
 
Tags: Municipal taps for four storey rental buildings in Punganur

Natyam ad