ముషీరాబాద్ బంగారం దుకాణంలో చోరీ..

హైదరాబాద్ ముచ్చట్లు:
ముషీరాబాద్ బాకారంలోని ఓ బంగారం దుకాణంలో చోరీ జరిగింది. సుమారు 40 తులాల బంగారం, రూ.4లక్షల నగదు అపహరించినట్లు వ్యాపారి శ్రీనివాసాచారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీ ఆధారాలు దొరక్కుండా దుండగులు చాకచక్యంగా వ్యవహరించారని తెలుస్తుంది. సీసీ టీవీ కేబుల్ కట్ చేసి దుండగులు డీవీఆర్ను ఎత్తుకెళ్లారు. అదేవిధంగా ఇల్లు, దుకాణం పరిసరాల్లో దొంగలు కారం చల్లి పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *