Natyam ad

ఆదర్శ ఉన్నత పాఠశాలగా రాణించాలి

– మ్యధ్యాహ్నభోజనంను తిన్న ఎంపీపీ, జెడ్పిటీసీ
-నాడునేడు ద్వారా రూ:81లక్షలతో అభివృద్ది
– ఉప్యాధ్యాయుల తీరు మార్చుకోవాలని సూచన
– విద్యతోపాటు, క్రీడల్లోనూ ప్రోత్సహించండి
 
చౌడే పల్లె ముచ్చట్లు:
 
విద్య, క్రీడలు, సాంకేతిక పరిజ్ఞానంతోపాటు పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించి మేకలచిన్నేపల్లెఉన్నతపాఠశాల ఆదర్శంగా రాణించాలని ఎంపీపీ రామమూర్తి, జెడ్పిటీసీ స్రభ్యుడు దామోదరరాజు అన్నారు. గురువారం మండలంలోని శెట్టిపేట పంచాయతీ మేకలచిన్నేపల్లె ఉన్నతపాఠశాలను, ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల, పిల్లల హాజరును పరిశీలించారు.మధ్యాహ్నభోజనం మెనూ అమలుపై విద్యార్థులను అడిగి తెలుసుకొన్నారు. వారు మాట్లాడుతూ నాడు-నేడు ద్వారా రూ:81 లక్షలతో ఉన్నతపాఠశాలలో మౌళికవసతుల అభివృద్దికి ప్రభుత్వం స్వీకారం చుట్టిందన్నారు.పాఠశాలలో ఉప్యాధ్యాయుల తీరు ను, మార్చుకోవాలని సూచించారు. మ్యధ్యాహ్నభోజనంను పిల్లలతో పాటు తిని రుచిచూశారు. ఉపాధ్యాయులు పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ఆయా రంగాల్లో వారిని ప్రోత్సహించాలన్నారు. పాఠశాలలో అవసరమైన సదుపాయాలుకల్పనకు సహకరిస్తామని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు.అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి పౌష్టికాహార పంపిణీ, గర్భవతులు, బాలింతల వివరాలు,పిల్లల హాజరును పరిశీలించారు. చిన్నారుల్లో క్రమశిక్షణను చూసి ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ఓబుల్‌రెడ్డి, పీఎంసీ కమిటీ చైర్మన్‌ మధు, హెచ్‌ఎం నాగమల్లిక,పంచాయతీ కార్యదర్శి లత, అంగన్వాడి టీచర్‌ మునీశ్వరి, తదితరులున్నారు.

పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Must excel as an ideal high school