చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలి -న్యాయమూర్తి కార్తీక్‌

పుంగనూరు ముచ్చట్లు:
 
 
ప్రజలందరు చట్టాలు, న్యాయాల పట్ల అవగాహన కలిగి ఉండాలని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి కార్తీక్‌ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన కోర్టు ఆవరణంలో న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు. ప్రజలకు చట్టాలపై అవగాహన లేకపోవడంతో సమస్యలు ఎదురౌతుందన్నారు. ముఖ్యంగా మండల లీగల్‌ సర్వీసస్‌ అథారిటి ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించే ందుకు సంబంధిత వ్యక్తులకు , అధికారులకు నోటీసులు జారీ చేయడం జరుగుతుందన్నారు. అలాగే అథారిటి ద్వారా పేద కక్షిదారుల తరపున న్యాయవాదులను నియమించి, న్యాయసేవలు అందించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా లోక్‌అదాలత్‌లో కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్‌అదాలత్‌ తీర్పులపై అప్పీల్‌ ఉండదన్నారు. ఈ సమావేశంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు వీరమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
Tags; Must have an understanding of the laws -Judge Karthik‌

Natyam ad