Naanbabyam plays a boyish

నానబియ్యం బతుకమ్మకు వాయనం

Date:12/10/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ ప్రజల బతుకు పండుగ అయిన ‘బతుకమ్మ’ను పూల రూపంలో ఆరాధించే గొప్ప సంప్రదాయం మనది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుందీ పండుగ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఈ ఏడాది అక్టోబరు 9న బతుకమ్మ పండుగ మొదలైంది. ఇప్పటికే మొదటి మూడురోజుల పండుగలైన ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ వేడుకలు ముగిశాయి. ఇక బతుకమ్మ పండుగలో నాలుగోరోజైన ‘నానబియ్యం బతుకమ్మ’గా బతుకమ్మను కొలుస్తారు. ఈ రోజు తంగేడు, గునుగు పూలతో నాలుగంతరాలు బతుకమ్మను పేర్చి శిఖరంపై గౌరమ్మను పెడతారు. నానబియ్యాన్ని ఫలహారంగా పెడతారు. వాయనంగా నానబోసిన బియ్యాన్ని బెల్లంతో కానీ చెక్కరతో కానీ కలిపి ముద్దలు చేసి పెడతారు.
Tags:Naanbabyam plays a boyish

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *