Naga Chaitanya, Samantha, Shiva Nirvana Movie Complete Vizag Schedule ..

నాగచైతన్య, సమంత, శివ నిర్వాన సినిమా వైజాగ్ షెడ్యూల్ పూర్తి..

Date:22/11/2018
హైదరాబాద్‌ముచ్చట్లు:
రియ‌ల్ లైఫ్ క‌పుల్ నాగ‌చైత‌న్య, స‌మంత నిన్నుకోరి ఫేమ్ శివ‌నిర్వాన ద‌ర్శ‌క‌త్వంలో క‌లిసి న‌టిస్తున్నారు. ఈ ఇద్ద‌రూ న‌టిస్తున్న నాలుగో సినిమా ఇది. ఈ క్రేజీ కాంబినేష‌న్ ను త‌న క‌థ‌తో మ‌రింత క్రేజీగా మార్చేస్తున్నారు ద‌ర్శ‌కుడు శివనిర్వాన‌. కొన్ని రోజులుగా వైజాగ్ లో జ‌రుగుతున్న షెడ్యూల్ ఇప్పుడు పూర్తైపోయింది. న‌వంబ‌ర్ 26 నుంచి హైద‌రాబాద్ లో కొత్త షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. నవంబ‌ర్ 23న నాగ‌చైత‌న్య పుట్టిన రోజు. ఇప్ప‌టి వ‌ర‌కు 40 శాతం షూటింగ్ పూర్తైపోయింది. దివ్యాంశ కౌశిక్ ఈ చిత్రంలో రెండో హీరోయిన్ గా న‌టిస్తున్నారు. త‌ణికెళ్ళ భ‌ర‌ణి, రావు ర‌మేష్, పోసాని కృష్ణ‌ముర‌ళి, సుబ్బ‌రాజు ఇత‌ర కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ రొమాంటిక్ డ్రామాకు గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తుండ‌గా.. విష్ణు శ‌ర్మ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యాన‌ర్ లో సాహు గ‌ర‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
న‌టీన‌టులు:
నాగ‌చైత‌న్య‌, స‌మంత‌, దివ్యాంశ కౌశిక్, రావు ర‌మేష్, సుబ్బరాజు, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌ణికెళ్ళ భ‌ర‌ణి, ర‌విప్ర‌కాశ్, క‌ర‌ణ్, రాజ‌శ్రీ నాయ‌ర్.
Tags: Naga Chaitanya, Samantha, Shiva Nirvana Movie Complete Vizag Schedule ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *