Nandi is the main celebration of drama presents on 30th of this month

ఈ నెల 30 న నంది నాటక బహుమతుల ప్రధానోత్సవం

Date:19/09/2018
ఏలూరు ముచ్చట్లు :
21వ నంది నాటక బహుమతుల ప్రధానోత్సవం రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఏలూరులో నిర్వహించడం మనకెంతో గర్వకారణమని సమాచారశాఖ సహాయ సంచాలకులు కె. సుభాషిణి చెప్పారు. ఏలూరు జిల్లా పౌర సంబంధాధికారి కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఏలూరులోని శ్రీ కన్వెన్షన్ హాలు నందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2017 సంవత్సరానికిగాను నంది నాటక పోటీలు 5 విభాగాలైన పద్య నాటకములు, సాంఘిక నాటకములు, సాంఘిక నాటికలు, బాలల నాటికలు మరియు కళాశాల, విశ్వవిద్యాలయాల విద్యార్దుల నాటికలు తెనాలి, రాజమహేంద్రవరం, కాకినాడ, కర్నూలు, నంద్యాలలో నిర్వహించడం జరిగిందన్నారు. ఫిబ్రవరి, 2 నుండి ఏప్రియల్ 12, 2018 వరకు 360 నాటికల ప్రదర్శనలను నిర్వహించడం జరిగిందన్నారు.
వీటిలో నాటికలను పరిశీలించి 72 నంది నాటక బహుమతులను ఎ ంపిక చేయడం జరిగిందని చెప్పారు. ఈ బహుమతి ప్రధానోత్సవంతోపాటు 2017 సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయి నందమూరి తారక రామారావు రంగ స్థల పురస్కారాన్ని మరియు 2018 సంవత్సరానికిగాను రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయి కందుకూరి పురస్కారాలను కూడా ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. ఈ బహుమతి ప్రధానోత్సవానికి 300 మంది కళాకారులు మరియు సాంకేతిక నిపుణులు బహుమతులు అందుకోనున్నారని ఆమె తెలిపారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే ఈ కార్యక్రమం విజయవంతానికి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు తమ వంతుగా భారీ ఎత్తున ప్రచారం గావించాలని సుభాషిణి కోరారు. ఈ సందర్భంగా కొంతమంది పాత్రికేయులు తమకు సంబంధించిన కొన్ని సమస్యలను వారి దృష్టికి తీసుకురాగా , వ్రాతపూర్వకంగా తెలియచేస్తే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తవవంతు కృషిచేస్తానని తెలిపారు.
Tags:Nandi is the main celebration of drama presents on 30th of this month

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *