నంద్యాల మున్సిపల్ బడ్జెట్ నంద్యాల అభివృద్ధికి ఉపయోగకరం లేనిది-సిపిఎం

నంద్యాల ముచ్చట్లు:
ఈనెల 18న నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో నంద్యాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ నంద్యాల అభివృద్ధికి ఏ మాత్రం ఉపయోగకరంగా లేనిదని సిపిఎం పట్టణ కార్యదర్శి నరసింహులు
కార్యదర్శివర్గ సభ్యులు మహమ్మద్ గౌస్ ,లక్ష్మణ్ పి వెంకట లింగం అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణంను నందనవనంగా మారుస్తామని, ఇచ్చిన హామీలను ప్రతి వార్డు
సమస్యలను నెరవేరుస్తామని చెప్పిన నంద్యాల ఎమ్మెల్యే, మున్సిపల్ కౌన్సిలర్ లందరూ ప్రజలకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని, బడ్జెట్ ప్రవేశ పెట్టిన తీరు చూస్తుంటే కేవలం అంకెల గారడీ తప్ప
అభివృద్ధి కోసం ఏమాత్రం లేదని, పారిశుద్ధ్యం కోసం, పట్టణంలోని మురికి కాలువల వెడల్పు, నిర్మాణం కోసం అభివృద్ధి చేయడం కోసం కేటాయింపులు జరగలేదని అదేవిధంగా నంద్యాల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ
ఏర్పాటుకు నిధులు కేటాయించలేదు మున్సిపల్ పార్కుల అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులను చూపెట్టలేదని, ఇటీవల నంద్యాల పట్టణంలో కలిసిన పొన్నాపురం,
 
 
 
పొన్నాపురం కాలనీ, వెంకటేశ్వర పురం మోడల్ పురం రైతు నగరం ఇలాంటి గ్రామాల అభివృద్ధికి సరైన ప్రణాళిక లేక నిధులు కేటాయించడంలో శ్రద్ధ చూపడం లేదని, ఇప్పటికీ ప్రతి వార్డు లో సమస్యలతో ప్రజలు
సతమతమౌతుంటే పరిష్కారం చేయడం కోసం నిధులు వార్డుల వారీగా కేటాయించలేదని, ఎంత వరకు ఉన్న రాబోయే కాలంలో ప్రజల నుండి ఇంటి పన్ను,చెత్త పన్ను ,నీటి పన్ను లాంటి వాటిని వసూలు
చేయాలనే ఆలోచన చేసి మిగులు బడ్జెట్ 59కోట్లు  పెట్టడం జరిగిందని ప్రజల నుండి వసూలు చేసే టువంటి ప్రణాళిక సరైంది కాదని, ఇప్పటికే ప్రతి ఇంటి నుండి చెత్త పన్ను రూపంలో 50 నుండి 30
రూపాయలు వసూలు చేయాలని నిర్ణయించడం దుర్మార్గమని అన్నారు. ప్రజల కోసం నంద్యాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టి ఉంటే బాగుండేదని, నంద్యాల పట్టణ అభివృద్ధి పై ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేదు
అని తెలియజేసే బడ్జెట్ అని, ఇది ప్రజలను ఇబ్బందులకు గురి చేసి వారి నుండి వసూలు చేసేటువంటి బడ్జెట్ అని దీనిని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రాబోయే కాలంలో ప్రతి
వార్డులో సిపిఎం పార్టీగా తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని పోరాటంలోకి తీసుకువస్తామని అన్నారు.
 
Tags: Nandyal Municipal Budget is useless for Nandyal development-CPM

Natyam ad