Nani is the hero who has visited Sriravi

 శ్రీవారిని దర్శించుకొన్న హీరో నాని దంపతులు

Date: 11/12/2017
తిరుపతి ముచ్చట్లు:
నాచురల్ స్టార్ నాని దంపతులు తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకొన్నారు. ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో నాని సతీసమేతంగా స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం నానీ మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడు అర్జున్’తో కలిసి మొదటిసారి శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నాడు.సినిమాల విషయానికొస్తే.. యేడాదికి నాలుగైదు సినిమాలతో వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు నాని. ఈ యేడాది నేను లోకల్, నిన్నుకోరి సినిమాలతో హిట్స్ కొట్టాడు. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో నాని-సాయి పల్లవి జంటగా నటించిన “ఎంసిఎ” ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు, నాని నిర్మాతగా మారి ‘అ’ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
Tag: Nani is the hero who has visited Sriravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *