మహిళల సాధికారత కు ప్రాధాన్యత

గూడూరు ముచ్చట్లు:
 
మహిళల సాధికారతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో నడుస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం అని గూడూరు ఎమ్మెల్యే  వర ప్రసాదరావు తెలిపారు .  గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు .  ఈ సమావేశంలో  జెడ్పిటిసి సభ్యురాలు యామిని , మాజీ  మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల , వైసీపీ నాయకులు నరేందర్ రెడ్డి , శ్రీనివాసులు , గోపాల్ యాదవ్ , మురళి , నరసయ్య  , విజయ్ కుమార్ రెడ్డి  , మొబిన్ తదితరులు పాల్గొన్నారు.గూడూరు ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన  విలేకరుల సమావేశంలో   ఎమ్మెల్యే  వర ప్రసాదరావు  మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా  నామినేటెడ్ పదవులలో 50 శాతం పదవులు మహిళలకు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు . రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో మహిళలకు పెద్దపీట వేస్తూ అమ్మఒడి , చేయూత , ఆసరా పథకాలు అమలులో ఉన్నాయని తెలిపారు . మహిళల రక్షణ కోసం దిశా యాప్ దేశ చరిత్రలో మొదటిసారిగా ప్రవేశ పెట్టి మహిళల సంక్షేమానికి పాటుపడే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని తెలిపారు . మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల 8వ తేదీన విజయవాడలో తలపెట్టిన మహిళా సదస్సు విజయవంతం చేసేందుకు నియోజకవర్గ పరిధిలోని మహిళలు అందరూ సహకరించాలని కోరారు .  రాష్ట్ర స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ దూసుకుపోతున్నారు అని పేర్కొన్నారు . మహిళలకు  ప్రోత్సాహం అందించగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు సాధికారత అందిస్తున్నారని కొనియాడారు . ఈ క్రమంలో విజయవాడలో జరుగుతున్న మహిళా సదస్సు విజయవంతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు . రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల్లో సుమారు 60 శాతం వరకు మహిళలకు అవకాశం కల్పించి మహిళలను గౌరవించే వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు .
 
Tags: Nara Lokesh’s visit to Mangalagiri …

Natyam ad