Narasimhan .. Safe ..

నరసింహన్.. సేఫ్..

Date:11/01/2018

ఢిల్లీ ముచ్చట్లు

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ మార్పుపై వస్తున్న ఊహాగానాలన్నీ ఉత్తుత్తివేనంటున్నారు ఢిల్లీ జర్నలిస్టు వేగులు. వరుస వివాదాల నేపథ్యంలో నరసింహన్ కి ఊస్టింగ్ ఆర్డర్ ఖాయమని, అందుకే ఆయన్ను ఢిల్లీకి పిలిపించారని నిన్నటివరకూ తెలుగు మీడియా హౌస్ లన్నీ హోరెత్తించాయి. కానీ.. ఈసారి కూడా ఆయన ‘తృటిలో’ ప్రమాదం నుంచి తప్పించుకున్నారని, కొత్తగా ఏర్పడ్డ రెండు తెలుగు రాష్ట్రాలకు నరసింహన్ కంటే సమర్ధుడైన గవర్నర్ అందుబాటులో లేడని బీజేపీ అధిష్టానం లీకులిచ్చినట్లు ఢిల్లీలో తెలుగు మీడియా వర్గాలు చెబుతున్నాయి.

ఇక.. దాయాది రాష్ట్రాల మధ్య గొడవలు సహజమని..
అన్నీ సర్దుకుంటాయని గవర్నర్ నరసింహన్ చెబుతున్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ఆయన ఇరు రాష్ట్రాల రాజకీయ, పరిపాలన పరిస్థితులపై కేంద్ర హోంశాఖకు డిటైల్డ్ రిపోర్ట్ అందజేశారు. విభజన చట్టంలోని కొన్ని సమస్యలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, అవి కూడా త్వరలో సర్దుకుంటాయని గవర్నర్ మీడియాతో చెప్పారు. ఏపీ సీఎంతో ప్రధాని భేటీ కానున్న నేపథ్యంలో..

‘స్టేటస్ రిపోర్ట్’ తెలుసుకోవడం కోసమే గవర్నర్ ని ఢిల్లీకి పిలిపించుకుంది కేంద్రం. కాగా.. నరసింహన్.. కేసీఆర్ పక్షపాతిగా మారిపోయారని ఇటు తెలంగాణ ప్రతిపక్షం, అటు ఏపీ అధికార పక్షం గట్టిగా ఆరోపించిన నేపథ్యంలో..

నరసింహన్ కి ఉద్వాసన తప్పదన్న వార్తలొచ్చాయి. ఇప్పటికైతే.. ‘గవర్నర్ మార్పు’ అంశం కేంద్ర పరిశీలనలో లేదని తేలిపోయింది.

Tags : Narasimhan .. Safe ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *