Narendra Modi's relations with PM: Rahul

నీరవ్ మోదీతో ప్రధానికి సంబంధాలు : రాహుల్

Date:15/02/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
నీరవ్ మోదీ వ్యవహారం రాజకీయంగా కూడా వేడెక్కిస్తోంది. నీరవ్ విదేశాలకు పారిపోయాడని అనుమానాలు రావడంతో… కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలు ప్రధానిని కార్నర్ చేసింది. పీఎంపై రాహుల్ సెటైర్లు వేశారు. ట్వీట్‌తో తనదైన శైలిలో పంచ్‌లు విసిరారు. దేశాన్ని ఎలా లూటీ చేయాలో కాంగ్రెస్ యువరాజు సూచనలు చేశారు. ప్రధాని గారిని కౌగిలించుకోండి… దావోస్‌లో ఆయనతో కనిపించండి. ఆ బిల్డప్‌తో రూ.12000 కోట్లు కొట్టేసి… మాల్యా వెళ్లినట్లు విదేశాలకు చెక్కెయొచ్చని ట్వీట్ చేశారు. దీనికి మరికొన్ని ఫోటోలు జోడిస్తూ ఆ పార్టీ అధికార ప్రతినిధితో పాటు కొంతమంది నేతలు రీ ట్వీట్లు చేశారు.అంతకుముందు మోదీ సర్కార్‌ను ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రంగా విమర్శించారు. ఈ కుంభకోణంలో బీజేపీ ప్రమేయం ఉందని ఆరోపించారు. కేంద్రం జోక్యం లేకుండా నీరవ్‌ మోదీ, విజయ్‌ మాల్యాలు దేశం విడిచిపెట్టి వెళ్లారంటే నమ్మగలమా..? అంటూ ప్రశ్నించారు. నీరవ్ వ్యవహారంలో కేంద్రాన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేయడంతో రాజకీయం మరింత వేడెక్కింది. మరి ఈ కామెంట్స్‌పై బీజేపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
Tags: Narendra Modi’s relations with PM: Rahul

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *