నేషనల్ హైవే…4 ఎక్కడా…

-పనులు సాగూ….తోన్నాయి
Date:09/10/2018
తిరుపతి ముచ్చట్లు:
రూ.వందల కోట్ల ప్రాజెక్టు.. 37 కి.మీ దూరం రోడ్డు.. ఇప్పటికి పూర్తయ్యింది 1.6 కి.మీ..ఉన్నది ఏడాది మాత్రమే గడువు. కానీ మూడేళ్ల నుంచి పనులు సాగుతున్నాయి. 37 కిలోమీటర్ల దూరం జరగాల్సిన రోడ్డు పనులు గతేడాది నవంబరు 15న ప్రారంభించారు. అగ్రిమెంటు ప్రకారం వచ్చే ఏడాది నవంబరు 14వ తేదీకి పూర్తి కావాలి. ఇప్పటివరకు రెండు నాలుగు లేన్ల రోడ్డులో 1.63 కి.మీ మాత్రమే వందశాతం పూర్తయ్యింది. చెరోవైపు అక్కడక్కడ రోడ్డు వేయడంతో సగటున 6.4కి.మీ పూర్తి చేశారు. ఈ దూరంలో 74 ప్రాంతాల్లో కల్వర్టులు నిర్మించాల్సి ఉంది.
32 మాత్రమే పూర్తి చేశారు. ఇందుకు దశలవారీగా రూ.56.26 కోట్ల బిల్లులు కూడా తీసుకున్నారు. ప్రస్తుతం పనులు నిలిచిపోయి వారం రోజులవుతోంది. చేసిన కొద్దిపాటి పనులకు బిల్లులు వస్తేనే మళ్లీ మొదలుపెట్టాలని టీడీపీ నేతలు భీష్మించుకూర్చోవడమే దీనికి ప్రధాన కారణం.బంగారుపాళ్యం మండలం నలగాంపల్లెనుంచి తమిళనాడులోని రాణిపేట సరిహద్దు ఉన్న ఆంధ్ర బార్డర్‌ వరకు చెన్నై–బెంగళూరు జాతీయ రహదారి నాలుగు లేన్ల విస్తరణ పనులను హైదరాబాద్‌కు చెందిన గాయత్రీ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ దక్కించుకుంది.
కేంద్ర జాతీయ రహదారుల శాఖ ఇందుకోసం రూ.306 కోట్లు కేటాయించింది. గాయత్రీ కంపెనీ నుంచి జెడ్పీ చైర్‌పర్సన్‌ గీర్వాణి నాయుడు, పాలసముద్రం జెడ్పీటీసీ చిట్టిబాబు నాయుడు, మరో ఇద్దరు కలిసి ప్రాజెక్టు పనులను సబ్‌లీజుకు తీసుకున్నారు. ఈ పనులు ఆశించిన స్థాయిలో వేగంగా జరగడం లేదు. దీంతోపాటు మొదలైన పూతలపట్టు, పలమనేరు, మదనపల్లె జాతీయ రహదారుల విస్తరణ పనులు 70 శాతం పూర్తయితే చిత్తూరు ప్రోగ్రెస్‌ ఇందులో సగానికి కూడా చేరుకోలేదు. నిర్ణీత గడువు లోపు రోడ్డు పనులు పూర్తవుతాయో లేదో అనే సందిగ్ధత నెలకొంది.
పనులు ప్రారంభించి ఏడాది కావస్తున్నా నిత్యం దుమ్ముధూళితో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. అయినా టీడీపీ నేతల్లో చలనం కనిపించడం లేదు. చిత్తూరు వైపు జరుగుతున్న జాతీయ రహదారి పనులను సబ్‌ లీజుకు దక్కించుకున్న నలుగురు భాగస్వాముల ఆందోళన. అధికారమే పెట్టుబడిగా రూ.306 కోట్ల విలువైన పనులను బినామీ పేరిట సబ్‌ లీజుకు చేజిక్కించుకున్న చిత్తూరు జెడ్పీ చైర్‌పర్సన్‌ గీర్వాణి వ్యూహం బెడిసికొడుతోంది.
చిత్తూరు మీదుగా జరుగుతున్న ఎన్‌హెచ్‌–4 పనులు పూర్తిగా స్తంభించడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచడం లేదు. అనుభవం లేకున్నా రూ.వందల కోట్ల విలువైన పనులు పూర్తిచేస్తే ఎటులేదన్నా రూ.50 కోట్ల వరకు మిగుల్చుకోవచ్చనుకున్న నేతల పాచిక పారడం లేదు.
Tags: National Highway … 4 somewhere …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *