యూపీ సర్కారుకు జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు

లక్నోముచ్చట్లు:
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సాగిన ఎన్కౌంటర్లపై ఆ రాష్ట్ర సర్కారుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. యూపీలో శాంతిభద్రతల పరిరక్షణ పేరిట సర్కారు ఆమోదంతోనే కేవలం ఆరునెలల కాలంలో 433 ఎదురుకాల్పుల ఘటనలు జరిగాయని, ఈ కాల్పుల్లో 19 మంది నేరస్థులు మరణించగా, 89 మంది గాయపడ్డారు. ఈ ఎన్కౌంటర్లపై ఆరు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని జాతీయ మానవ హక్కుల సంఘం, హ్యుమన్ రైట్స్ వాచ్ డాగ్ ఆఫ్ ఇండియా యూపీ సర్కారు చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేశాయి. శాంతి భద్రతల పరిరక్షణ పేరిట చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని నేరస్థులను హతమారుస్తుందని వచ్చిన ఆరోపణలపై సుమోటోగా స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది.
Tag : National Human Rights Commission Notices to the UPA Government


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *